భారత్ కు చేరుకున్న రఫేల్ యుద్ధ విమానాలు... షాక్ లో ఆ రెండు దేశాలు...?

Reddy P Rajasekhar

రఫేల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితం మన దేశానికి చేరుకున్నాయి. సుఖోయ్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోగానే స్వాగతం పలికాయి. అంబాలా ఎయిర్ బేస్ లో రఫేల్ యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. మన దేశానికి ఫ్రాన్స్ నుంచి ఈ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. కేంద్రం ఈ రఫేల్ యుద్ధ విమానాలను పాక్, చైనాలకు సమ దూరంలో వ్యూహాత్మాక ప్రదేశంలో ఉంచనుందని తెలుస్తోంది. 
 
రఫేల్ యుద్ధ విమానాలకు వేరే ఏ యుద్ధ విమానాలకు లేని ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లక్ష్యం తప్పకుండా.... శత్రువుకు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా 60 వేల అడుగుల ఎత్తుకు ఈ యుద్ధ విమానాలు చేరుకోగలవు. బలమైన లక్ష్యాలను ఈ యుద్ధ విమానాలు నాశనం చేయగలవు. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ధ్వంసం చేయగలగడం ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. 
 
రఫేల్ సరిహద్దులను దాటకుండా శత్రు యుద్ధ విమానాలపై దాడి చేయగలదు. ధ్వని వేగం కంటే నాలుగు రెట్లు వేగంగా వెళ్లే ఈ యుద్ధ విమానాలు రాడార్ మార్గనిర్దేశాలను అనుసరించి పయనిస్తాయి. ఇందులోని స్కాల్ప్ క్షిపణి 600కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాలను చేరుకోగలదు. ఒక రఫేల్ యుద్ధ విమానం బరువు 10 టన్నులు. నిమిషానికి 2500 రౌండ్లు పేల్చే శక్తి ఈ యుద్ధ విమానాలకు సొంతం. 
 
పర్వత ప్రాంతాల్లో పోరాటానికి ఈ యుద్ధ విమానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానాలుగా రఫేల్ యుద్ధ విమానాలకు ప్రత్యేక స్థానం ఉంది. రక్షణ శాఖ ఈ విమానాన్ని అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా భావిస్తోంది. దక్షిణ ఆసియాలోనే ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన యుద్ధ విమానం రఫేల్ కావడం గమనార్హం.  భారత్ కు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోవడంతో పాక్, చైనా దేశాలు టెన్షన్ పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: