జులై 31వ తేదీ లోపు ఈ పనులను చేయకపోతే మీకు నష్టం వాటిల్లుతుంది..!

Suma Kallamadi
మార్చి 30, 2020వ సంవత్సరం లోపు కట్టాల్సిన టాక్స్ లు యొక్క ఆఖరి తేదీలు అన్ని జులై 31వ తేదీ వరకు పొడిగించబడ్డాయి. ఈ విపత్కర పరిస్థితులలో సామాన్యుడు టాక్సెస్ కట్టుకోవడానికి ఇబ్బంది పడతాడు అన్న ఉద్దేశంతో ఇన్ని నెలల పాటు ప్రభుత్వం చెల్లింపు తేదీలను వాయిదా వేసుకుంటూ వచ్చింది. అలాగే చాలా రకాల పన్నులు కట్టేందుకు చివరి తేది జూలై 31, 2020 అని ప్రకటించింది. అయితే దీనిబట్టి రేపే చివరితేదీ అవుతుండడంతో మీరు కట్టవలసిన టాక్సెస్ ఏంటో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం.


2019-20 ఆర్థిక సంవత్సరంలో మీ సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూ.లక్షకు పైన ఉంటే... దాన్ని జూలై 31 తారీఖు లోపు చెల్లించండి. లేకపోతే ఆలస్యం చేసినందుకు గాను మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే జులై 31 వ తారీకే పన్ను కట్టేందుకు చివరి రోజు. ఈ తేదీలోపు మీరు పన్నులు చెల్లించినట్లైతే ప్రభుత్వం మీకు ప్రతి నెల ఒక్క శాతం పన్నుల వడ్డీ ఎత్తి వేస్తుంది.


యజమానులకు ఉపశమనం కలిగించడానికి... ఉద్యోగులు ఎక్కువ జీతాన్ని తమ ఇంటికి తీసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్) ని మూడు నెలలు అనగా మే, జూన్, జూలై వరకు తక్కువగా తీసుకుంటుంది. కానీ జులై 31 వ తారీకు అనంతరం 10 శాతానికి బదులు 12% ఈపీఎఫ్ మీ జీతం నుంచి తీసుకుంటుంది. అయితే ఈ కరోనా సమయంలో వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కి ఎవరైతే డబ్బులు చెల్లిస్తున్నారో వారు తక్షణమే తమ చెల్లింపులను నిలిపి వేయాలి. లేకపోతే వారి జీతం నుండి పెరిగిన ఈపీఎఫ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో డబ్బులు తీసుకొనబడతాయి.


2019-20 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు చెల్లించాల్సిన వారు జులై 31వ తేదీ లోపు చెల్లించకపోతే వారిపై పన్నుల భారం అధికమౌతుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి చెందిన ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ మార్చి 31వ తేదీన చెల్లించాల్సి ఉండగా జూలై 31వ తేదీ 2020 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: