కరోనా కాదు.. సమాజం అతన్ని చంపేసింది.. కరోనా పరీక్షల కోసం వెళ్లి.. చివరికి..?
మనుషుల్లో మానవత్వం చంపి కఠినాత్ముడు గా మార్చిన కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నో హృదయ విదారక ఘటన లు మనం చూస్తూనే ఉన్నాం, చుట్టూ వంద మంది జనాలు ఉన్నప్పటికీ ఒక మనిషిని నిస్సయుడిగా చేసి... ధైర్యాన్ని చంపేసి... మానసికంగా కుంగిపోయేలా చేసి చివరికి ప్రాణాలు తీస్తుంది ఈ కరోనా వైరస్. మరికొన్నిసార్లు కరోనా సోకింది అనే భయంతో కూడా ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎంతోమంది. ఎంతో మందిని మృత్యువు ఒడిలోకి చేరిస్తుంది ఈ కరోనా రక్కసి. తాజా విషాదకర ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది.
కరోనా లక్షణాలు ఉన్న ఓ యువకుడు పరీక్షలు చేయించుకునేందుకు వచ్చి.. అక్కడే కన్నుమూసాడు. విషాదకర ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి సప్తగిరి కాలనీ లో జరిగింది. తిరుపతి సప్తగిరి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ఆయన కుమారుడు శేఖర్ కరోనా పరీక్షలకోసం అలిపిరి లింక్ బస్ స్టాండ్ లోనే సంజీవని బస్సు దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఆ బస్సు దగ్గర భారీగా క్యూ ఉంది. గంటన్నర తర్వాత... నమూనాల కోసం వారికి స్వాప్స్ ఇచ్చారు.
రిపోర్టులు తర్వాత వస్తాయని వైద్యులు చెప్పడంతో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శేఖర్. అక్కడే ఎంతో మంది ఉన్నప్పటికీ వారిని ఎవరూ సాయం చేయలేదు. చివరికి ఎంతో కష్టం మీద తండ్రి పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. నిండు గర్భిణి అయిన తన కోడలికి నీ చావు వార్త ఎలా చెప్పను అంటూ ఆ తండ్రి విలపిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.Powered by Froala Editor