ట్రంప్ లో భయం.. మొదటిసారి వెనకడుగు.. అసలేం జరుగుతుంది..?

praveen
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ దేశానికి భయపడి వెనకడుగు వేయలేదు. ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అది దేశాల విషయంలో అయినా వలస ప్రజల విషయంలో అయినా.. ప్రతి ఒక్క విషయంలో కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్కును ప్రదర్శిస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న అమెరికాలో తీవ్రస్థాయిలో.. నల్లజాతీయులు తెల్లజాతీయులు అంటూ ఘర్షణ  వాతావరణం జరిగినప్పటికీ.. తనదైన సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారూ.



కానీ ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్  భయపడుతున్నాడా అంటే అవును అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. తాజా ఘటనలు  కూడా దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే త్వరలో అమెరికాలో  ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఎన్నికలను వాయిదా వేయాలంటూ విజ్ఞప్తులను దిగుతున్నారు డోనాల్డ్ ట్రంప్. ఇంతకీ ఎన్నికలకు   ట్రంప్ ఎందుకు అంతలా భయపడుతున్నారు.. ఎందుకు అలా వాయిదా వేయాలని కోరుతున్నారు అనే అంశం విషయంలో ఎన్నో వాదనలు తెరమీదకు వస్తున్నాయి.



ఎన్నికల్లో  బ్యాలెట్ ఓట్లు అధికారుల దగ్గరికి వెళ్లిన తర్వాత.. జో బిడెన్ అందరు  అధికారులను కాంటాక్ట్ అయ్యి.. ఒక తరహా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ట్రంప్  భావిస్తున్నారు అంటూ ఒక వాదన వినిపిస్తూ ఉంటే.. ఈ పోస్టల్ బ్యాలెట్  కారణంగా చెల్లని ఓట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని... అందుకే కరోనా  వైరస్ ప్రభావం తగ్గించే వరకు  ఎన్నికలను వాయిదా వేయాలి అంటు ప్రస్తుతం ట్రంప్  కోరుతున్నట్లు తెలుస్తోంది, అయితే ట్రంప్ ఎన్నికల వాయిదా కోరడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా లేదా నిజంగానే భయంతోనే అన్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: