భార్య మోటు సరసం.. నడవలేని స్థితి కి భర్త.. చివరికి భార్య జైలు పాలు..?

praveen
ఆలుమగల మధ్య సరసం అనేది సర్వ సాధారణం. ఆలుమగల మధ్య శారీరక కలయిక వారి దాంపత్య జీవితాన్ని  మరింత బలంగా చేస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆలుమగల మధ్య బంధం  ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలంటే శారీరక కలయిక తప్పనిసరి అంటారు. ఇలా భార్యభర్తల మధ్య శృంగారం... ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది అని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఇక్కడ భార్య చేసిన మోటు సరసానికి... భర్త కు చుక్కలు కనిపించాయి. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు సదరు భర్త. చివరికి భార్య కటకటాల పాలవ్వాల్సిన  దుస్థితి వచ్చింది.



ఫ్లోరిడాలోని తంపా లో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనస్తశియా  అనే ఒక 44 ఏళ్ల మహిళా... తన భర్తతో కలిసి మంచి నిద్రలో వుంది. ఇంతలో ఆమె కి శృంగార భరితమైన ఆలోచనలు రావడం మొదలయ్యాయి... అప్పటికే భర్త మాంచి నిద్రలో ఉన్నాడు. అయితే ఆ సమయంలో భర్త ను నిద్రలేపి ఉంటే బాగుండేదేమో.  కాని సదరు మహిళ మాత్రం అలా చేయలేదు. తన భర్త అంగాన్ని వృషణాలను చేతిలో పట్టుకుని గట్టిగా గుంజింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ భర్త... ప్రాణాలు పోయినంత పనయింది. భార్య  చేసిన మోటు సరసం కాస్త భర్త ప్రాణాల మీదికి తెచ్చింది. భార్య మోటు సరసం తో భర్త కనీసం లేచి నడవలేని స్థితి కి వచ్చాడు.



 ఈ విషయమై భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరగగా  అది పోలీసుల వరకు వెళ్ళింది. భర్త భార్య పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భర్త ఫిర్యాదుతో భార్యను కటకటాల వెనుకకు తోసారు పోలీసులు, కానీ తాను మాత్రం ఏం  తప్పు చేయలేదు అంటూ వాదించింది సదరు మహిళ. కాగా ఈ  దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏదేమైనా భార్యాభర్తల మధ్య సరసాలు ఉండాలి కానీ ఇలాంటి మోటు సరదాలు ఉంటే మాత్రం కాస్త ప్రాణాలకే ప్రమాదమని సుమీ అని అంటున్నారట స్థానికులు..Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: