బ్రతికుండగానే అధికారులు ఆ వృద్ధురాలిని చంపేశారు.. చివరికి..?
ఎన్నో బ్బందులు పడుతుంది. అధికారులు ఆ వృద్ధురాలు బతికుండగానే రికార్డుల్లో చనిపోయినట్లుగా నిర్ధారించి ఆ వృద్ధురాకి పింఛన్ నిలిపివేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలల నుంచి వృద్ధురాలికి పింఛన్ అందడం లేదు. ఏంటి అని అడిగితే పింఛన్ దారుల్లో మీ పేరు లేదు అంటూ సమాధానం చెబుతున్నారు అంటూ ఆ వృద్ధురాలు వాపోయింది. వేణుతురుమిల్లి ఎస్సీ వాడికి చెందిన పాగోలు భాగ్యమ్మ రెండు దశాబ్దాలుగా ఫించన్ పైనే జీవనం సాగిస్తుంది. ఎలాంటి పని చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండటంతో కేవలం పింఛన్ తోనే జీవితం సాగిస్తోంది. ఇక కొన్ని నెలల క్రితం కొడుకు ను చూసేందుకు గ్రామంతరం వెళ్లి అక్కడే లాక్ డౌన్ కారణంగా ఉండి పోయింది సదరు వృద్ధురాలు.
రెండు నెలలపాటు పింఛన్ తీసుకోలేకపోయింది ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి పింఛన్ కోసం వెళ్తే .. ఏకంగా ముఖం మీదే చనిపోయావంటూ అధికారులు చెప్పారు. పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారు. రికార్డుల్లో కూడా ఆ వృద్ధురాలు చనిపోయినట్లుగా నమోదు చేశారు అధికారులు, మామూలుగా నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే అది రద్దు అవుతుంది, ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రామ వాలెంటర్ల్లు వివరణ ఇస్తున్నారు.Powered by Froala Editor