వరుడు కావాల్సిన వాడు శవం అయ్యాడు.. కారణం..?
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దీన్ పురానికి చెందిన వేల్పుల ఏడుకొండలు కుటుంబం కొన్నేళ్ల క్రితం జిల్లాలోని బేతంచెర్ల వచ్చి స్థిరపడ్డారు. ఇటీవల ఏడుకొండల కి మహానంది మండలం నంది పల్లికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది ఆగస్టు 7వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ముహూర్తం ఫిక్స్ చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇంకొన్ని రోజులు తన పెళ్లి జరిగి పోతుంది అని ఏడుకొండలు ఎంతో ఆనందంగా ఉన్నాడు కానీ అంతలో ఊహించని షాక్. ఏవో కారణాలు చెబుతూ యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో యువకుడి సంబరం మొత్తం నిరాశగా మారిపోయింది.
ఇక పెళ్లి ఆగిపోయింది అని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు యువకుడు. ఈ క్రమంలోనే ఇదే బాధతో రెండు మూడు రోజుల వరకు గడిపాడు. ఆ తరువాత పెళ్లి ఆగిపోయిందన్న బాధను తట్టుకోలేక పోయిన ఏడుకొండలు ఏకంగా శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు, ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఏడుకొండలు ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఏడుకొండలు మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏడుకొండలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Powered by Froala Editor