బ్రేకింగ్ : కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి...?

Reddy P Rajasekhar
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ బారిన పడి బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందారు. నెల రోజుల క్రితం మాణిక్యాలరావుకు కరోనా సోకింది. అప్పటినుంచి ఆయన విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ నుంచి ఎన్నికైన మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. 2014లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన్ని రోజుల క్రితం మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కు కరోనా సోకిందని... ఆయనతో కలిసి కారులో ప్రయాణించిన తర్వాత కరోనా పరీక్ష చేయించుకుంటే వైరస్ నిర్ధారణ అయిందని మీడియాకు తెలిపారు.
 
నాలుగు రోజుల క్రితం మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కాలేయానికి ఇన్ ఫెక్షన్ సోకింది. కరోనాతో బాధ పడుతున్న సమయంలో కాలేయ సమస్య రావడంతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఫొటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎన్నికైన మాణిక్యాలరావు  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నారు.      
 
మాణిక్యాలరావు మృతి గురించి మరికాసేపట్లో బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాణిక్యాల రావు మృతి ప‌ట్లు పలువురు రాజ‌కీయ నాయ‌కులు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నారు. మాణిక్యాలరావు పూర్తి పేరు పైడికొండల మాణిక్యాలరావు. తనకు కరోనా సోకిన విషయాన్ని జులై 4న ఆయనే స్వయంగా తెలియజేశారు. మాణిక్యాలరావు మృతిపై బీజేపీ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.  కోవిడ్ నిబంధనల ప్రకారం మాణిక్యాల రావు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన తొలి తెలుగు నేత మణిక్యాలరావు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: