కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో భారత సైన్యంలోకి..?
ఇప్పటివరకు ఏ దేశ వైమానిక దళంలో లేని సరికొత్త టెక్నాలజీతో... ఎంతో ఖర్చు చేసి మరీ.. రీ డిజైనింగ్ చేసి తయారుచేసిన ఐదు రఫెల్ యుద్ధ విమానాలను ఇటీవలే భారత అమ్ములపొదిలో చేర్చిన విషయం తెలిసిందే. రఫెల్ రాకతో భారత వైమానిక దళం ఎంతో శక్తివంతంగా మారింది అన్నది తెలిసిన విషయమే. అంతటితో ఆగకుండా... భారత వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన టెక్నాలజీతో కూడిన మరో 83 యుద్ధ విమానాలను భారత అమ్ములపొదిలో చేర్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. తేజస్ యుద్ధ విమానాల తయారీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దాదాపు 83 తేజస్ యుద్ధ విమానాల తయారీకి.. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో 39 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం.
2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ 83 తేజస్ యుద్ధ విమానాలను సరఫరా చేయాలని... హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకుంది, ఓవైపు విదేశాల నుంచి ఎంతో అత్యాధునిక సదుపాయాలతో యుద్ధ విమానాలను తయారు చేస్తూనే మరోవైపు భారత స్వదేశీ యుద్ధ విమానాల తయారీ వ్యవస్థను కూడా మరింత ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే అధునాతన టెక్నాలజీతో కూడిన తేజస్ యుద్ధ విమానాలను సిద్ధం చేసేందుకు ఏరోనాటికల్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
Powered by Froala Editor