దేశ ప్రజలకు శుభవార్త... దోమతో వచ్చే వ్యాధులకు త్వరలో వ్యాక్సిన్...?
ఫ్రాన్స్‌కు చెందిన ఓసివ్యాక్స్ సంస్థ ఓవీఎక్స్836 పేరుతో యూనివర్సల్ వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది. ఇన్ఫ్ల్యూయెంజా వైరస్‌లోని అంతర్గత ప్రొటీన్లను లక్ష్యంగాచేసుకుని ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది. వైరస్ లను అడ్డుకోవడానికి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసే ఈ వ్యాక్సిన్ కరోనాను కూడా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని తెల్లరక్త కణాల్లో ఒకటైన టీ- సెల్స్.. వైరస్ అంతర్గత ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకొనేలా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
మరోవైపు మలేరియా, టైఫాయిడ్ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను అడ్డుకోవడానికి కూడా యూనివర్సల్ టీకా సిద్ధమైంది. దోమ కాటు ద్వారా అనేక రకాల వైరస్ లు ఒకరి నుంచి మరొకరికి సోకుతాయనే సంగతి తెలిసిందే. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ)కు చెందిన డాక్టర్ జెస్సికా మానింగ్ ‘యూనివర్సల్ మస్కిటో వ్యాక్సిన్'ను దోమకాటు ద్వారా సోకే వ్యాధులను అడ్డుకునేందుకు తయారు చేశారు.
ఈ వ్యాక్సిన్ ను ఏజీఎస్- 5 పేరుతో పిలుస్తారు. శాస్త్రవేత్తలు దోమలు ఒకరి నుంచి మరొకరికి వైరస్ ను వ్యాప్తి చేస్తాయని... కానీ దోమలు మాత్రం వైరస్ బారిన పడవని... ఈ ఆలోచన నుంచే దోమ లాలాజలంతో వ్యాక్సిన్ ను రూపొందించామని చెప్పారు. వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉందని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని... మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులను వ్యాక్సిన్ సులువుగా అడ్డుకోగలదని జెస్సికా తెలిపారు.