దారుణం.. కరోనా సోకిన వైద్యుల పట్ల ప్రభుత్వానికి మరీ ఇంత నిర్లక్ష్యమా..??
ఇక ఈ కరోనా పోరులో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, నర్సులపై నిరంతరం ఎంతలా శ్రమిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ ప్రాణాలు ప్రమాదం అని తెలిసినా.. వెనుకడుగు వేయకుండా కరోనాతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే అలాంటి వైద్య సిబ్బందికి కరోనా సోకితే.. చికిత్సను అందించేందుకు ప్రభుత్వమే ముందుకు రాలేదు. దీంతో చేసేదేం లేక ఆ వైద్య సిబ్బందియే ఏకంగా చందాలు కరోనా చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లో ఇప్పటికే మూడు వందల మందికి పైగా వైద్య సిబ్బందికి కరోనా సోకింది. అయితే ఆ రాష్ట్రంలో వైద్యరంగం పరిస్థితి బాగాలేదని.. పట్నాలోని ఎయిమ్స్ లో కనీసం 50శాతం పడకలు వైద్యసిబ్బంది కోసం కేటాయించాలని వైద్యులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో చేసేదేమి లేక కొందరు వైద్యులు చందాలు వేసుకొని మరీ 50 పడకలతో ఓ కరోనా చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ రోగులకు చికిత్స చేస్తూ కరోనా సోకిన వైద్యులకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో.. నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైద్యుల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నస్తున్నారు.