కరోనా టైమ్ ని క్యాష్ చేసుకున్న వాచ్ మెన్. కోటి రూపాయలతో..?
తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. కొన్ని రోజుల నుంచి ఎంతో నమ్మకస్తుడిగా పనిచేసిన వాచ్ మెన్ చివరికి ఆ ఇంట్లో సొమ్ము మొత్తం కాజేశాడు. దీంతో రిసెప్షన్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి... భారీ మొత్తంలో నగదు నగలు పోవడంతో ఇంటి యజమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు, చేసేదేమీలేక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన , సైనిక్ పురి లో నివాసముండే దంపతుల కుమారుడికి ఇటీవలే పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే కుమారుడికి ఫలక్ నుమా పాలస్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ అంతా ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు... ఇంతలో షాక్... అన్ని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతో పాటు ఎంతో విలువైన ఆభరణాలు వస్తువులు కనిపించడం లేదు. అంతేకాదు ఇంటికి కాపలాగా ఉండే వాచ్మెన్ కూడా కనిపించక పోవడంతో... ఇక ఆ ఇంటి దొంగ వాచ్ మెన్ అని అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఇంటి యజమానులు.
ఈ ఘటనపై బాధితులు వెంటనే కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొత్తం కిలో బంగారంతో పాటు విలువైన వస్తువులు నగదు కూడా చోరికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగతనం చేయబడిన మొత్తం వస్తువులు నగదు నగలు విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపిన బాధితులు... వాచ్మెన్ దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Powered by Froala Editor