వేడి నీళ్లు కరోనాను చంపేస్తాయా.... రష్యా శాస్త్రవేత్తల పరిశోధనలో ఏం తేలిందంటే....?
కరోనా సోకిన వాళ్లలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు ఎక్కువగా మృతి చెందుతున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల కొరత వల్ల కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య నిపుణులు ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే మాత్రమే వైరస్ ను జయించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ వేడి నీళ్లు తాగితే మంచిదని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా శాస్త్రవేత్తలు కరోనాను నియంత్రించడంలో వేడి నీళ్లు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. రష్యాలోని నవోసిబిరిస్క్లోని ‘వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ’కి చెందిన పరిశోధకులు వేడి నీళ్లు కరోనాకు చెక్ పెట్టడంలో మంచి ఫలితాలు ఇస్తాయని సూచిస్తున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రతో ఉండే నీళ్లు వైరస్ ను బలహీనపరుస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని తెలిపారు.
వేడి నీళ్లు రోజూ తాగితే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు, అధిక బరువు, ఊబకాయం సమస్యలను అధిగమించవచ్చు. వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ బృందం గది ఉష్ణోగ్రతలో ఉండే నీళ్లు వైరస్ పెరుగుదలను అడ్డుకుంటాయని... క్లోరైడ్ నీళ్లు కూడా కరోనాను కట్టడి చేయడంలో సహాయపడతాయని చెబుతున్నారు. ప్రతిరోజూ వేడి నీళ్లు తాగితే మంచిదని సూచిస్తున్నారు. సముద్రపు జలాల్లో కూడా కరోనా మనుగడ సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెప్పారు.