తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!

frame తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!

Suma Kallamadi
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్ర, యానాం లలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ పెద్దపల్లి, జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లా, ములుగు వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీరాలకు కి దగ్గర్లో వాయువ్య బంగాళాఖాతంలో ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని... ఈ అల్పపీడనం నిన్న ఏర్పడిందని... ఉపరితల ఆవర్తనం ఏడు కిలోమీటర్ల మేరకు ఏర్పడిందని.. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని... దీని కారణంగా ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాలతోపాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రోజున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర జిల్లాలలో ఈ రోజున భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని... రేపు మాత్రం కేవలం భారీ వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావరణ కేంద్ర శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే ముంబాయి నగరంలో భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా కురుస్తున్నాయన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదటిగా ఒరిస్సా రాష్ట్రం భారీ వర్షాలకు అల్లాడి పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ముంబై నగరం అతి భారీ వర్షాలతో, వరదలతో కొట్టుమిట్టాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: