టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొప్ప మనస్సు.... పేద కరోనా రోగుల కోసం ఏం చేశారంటే...?

Reddy P Rajasekhar
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు వైరస్ పేరు వింటే భయాందోళనకు గురవుతున్నారు. చాలామంది కరోనా రోగులకు వైరస్ సోకినా లక్షణాలు కనిపించడం లేదు. వాళ్లను వైద్యులు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకోవాలని.... ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే ఫోన్ ద్వారా సంప్రదించాలని చెబుతున్నారు.
 
అయితే చిన్నచిన్న ఇళ్లలో నివశించే వాళ్లకు ప్రత్యేక గదిలో ఐసోలేషన్ లో ఉండటం సాధ్యం కాదు. కొన్ని ప్రాంతాల్లో గ్రామస్తులు కరోనా నిర్ధారణ అయిన వాళ్లను ఊళ్లోకి రానీయడం లేదు. కరోనా వైరస్ కంటే కరోనా సోకితే ఇరుగు పొరుగు వాళ్ల నుంచి ఎదురవుతున్న సమస్యలే ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.
 
నర్సంపేటలో తన సొంత ఖర్చులతో పేదల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ద్వారకపేట రోడ్డులోని ఎస్ఎంఎస్ బాలికల హాస్టల్‌లో 200 పడకలతో ఏర్పాటైన ఐసోలేషన్ కేంద్రంను వరంగల్ రూరల్ కలెక్టర్ హరితతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ ఐసోలేషన్ కేంద్రంలో కరోనా బాధితులకు పౌష్టికాహారంతోపాటు కషాయం అందజేస్తారు. ఇళ్లలో ఉండటం ఇబ్బందిగా ఉన్న పేద ప్రజలు ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యే చెప్పారు.            
 
ఐసోలేషన్ కేంద్రంలో అన్ని వసతులను కల్పిస్తామని అన్నారు. లక్షణాలు లేకుండా కరోనా నిర్ధారణ అయినవాళ్లు తహశీల్దార్ అనుమతితో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు కావడం తొలిసారి. కొన్ని రోజుల క్రితం నెక్కొండ మండలంలోని కరోనా బాధితుల కరోనా బాధితుల ఇంటికి వెళ్లి మరీ సందర్శించారు. సోసల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. సరైన ఆహార నియామాలు, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: