నాడు చెప్పిన మాట వినట్లయితే.. ఈరోజున వందల మంది చనిపోకపోయేవారేమో..!
అయితే ఈ గత ఆరు సంవత్సరాల్లో లెబనాన్ ప్రభుత్వం, మిలటరీ అధికారులు, కస్టమ్స్ అధికారులు అమ్మోనియం నైట్రేట్ పేలిపోయే పదార్ధమని.. అది వెంటనే తరలించాలని పది సార్లు గట్టిగా హెచ్చరించారు. అయినా కూడా బీరుట్ ఓడరేవు శాఖ అధికారులు ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యం వహించారు. జులై 20 వ తేదీన కూడా మిలటరీ అధికారులు ఓడరేవు వద్దకు వెళ్లి గోదాములో నిల్వ ఉంచబడిన అమ్మోనియం నైట్రేట్ ని తరలించాలని హెచ్చరించారు. అప్పుడు కూడా ఓడరేవు అధికారులు వాళ్లు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.
వీరి నిర్లక్ష్యం కారణంగా ఆగస్టు 4 వ తేదీన అమ్మోనియం నైట్రేట్ నలుదిక్కులు పిక్కటిల్లేలా పేలిపోయింది. దీంతో 135 మంది పైచిలుకు ప్రజల చనిపోగా ఐదు వేల మంది కనుమరుగుకాగా... లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లెబనాన్ దేశ చరిత్రలోనే బీరుట్ దుర్ఘటన అతిపెద్ద ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే వందల మంది చనిపోయారని అక్కడి ప్రభుత్వం ఓడరేవు అధికారులను నిర్బంధించి విచారణ కొనసాగిస్తోంది. ఇకపోతే బీరుట్ ఘటనతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలన్నీ అమోనియం నైట్రేట్ ఏ చోట ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుందో వెతుక్కుని మరీ వాటిని ప్రజలకు దూరంగా... నిర్మానుష్య ప్రాంతాలకు తరలిస్తున్నారు.