చనిపోయాడు.. ఖననం చేసారు.. కానీ మళ్ళీ క్షేమంగా తిరిగొచ్చాడు..?

praveen
మామూలుగా ఎవరైనా మృతి చెందిన తర్వాత అంత్యక్రియ లు నిర్వహిస్తారు. కొంతమంది సాంప్రదాయం ప్రకారం ఖననం  నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇది  సర్వసాధారణం. అయితే ఇలా ఒకసారి మృతి చెంది ఖననం  నిర్వహించిన వ్యక్తి మళ్లీ మన కళ్ళ ముందుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. మన కళ్ల ముందు నిలబడిన వారిని చూసి మనని  మనమే నమ్మలేము... కాసేపటి వరకు షాక్  లో మునిగిపోతాం. ఎటు తేల్చుకోలేని స్థితిలో పడిపోతాం. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.



 స్వయంగా వారు ఖననం  చేసిన వ్యక్తి సజీవంగా తిరిగి రావడం తో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు . వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని  కాన్పూర్ పరిధిలో గల చమన్ గంజ్ నివాసి అహ్మద్ హసన్.. భార్య ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. కుటుంబంలో  తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో విసిగిపోయిన హాసన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు.కొన్ని  రోజులపాటు తిరిగి రాకపోవడం తో పోలీసుల కు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. ఇక పోలీస్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే  సమీపంలో పోలీసులకు ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.



 వెంటనే  అహ్మద్ కుటుంబ  సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు ఆ మృతదేహాన్ని చూపించారు. దీంతో ఆ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు.. హసన్  మృతదేహమే  అంటూ గుర్తించారు. ఇక ఆ మృృతదేహాని కి పోస్టుమార్టం అనంతరం  సాంప్రదాయాల ప్రకారం స్మశానవాటిక లో ఖననం  చేశారు కుటుంబ సభ్యులు. ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నాయి  ఇక  ఇంతలో అహ్మద్  ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు.. ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కలిసి వచ్చాయి. దీంతో  అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా... పోలీసులు అతన్ని.. అవాక్కయ్యారు. తర్వాత అతన్ని విచారిస్తు ఉన్నారు. కాగా ఆ  మృతదేహం ఎవరిది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: