భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త..!

Suma Kallamadi
దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో క్రైమ్ రేట్ కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ఎదో ఒక్క ప్రాంతంలో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. క్షణికావేశంతో కొందరు, పరువు హత్యలు, అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ మరికొందరు ఇలా ఏదొఒక్క ప్రాంతంలో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భార్య తల నరికి చంపేశాడో కసాయి భర్త. ఆమెను పదునైన ఆయుధంతో రెండు ముక్కలుగా నరికేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన బిహార్ ‌లోని బక్సర్ జిల్లాలో చోటుచేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బక్సర్ జిల్లాలోని బ్రహ్మపూర్‌కి చెందిన అల్గు యాదవ్(48)కి ఛత్తీస్‌ గఢ్ ‌లోని పాకుర్ జిల్లాకి చెందిన చాందినీ దేవితో 2013లో వివాహం జరిగింది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇక కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చిన భార్యాభర్తలు విడిపోయి మూడేళ్లుగా వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఉపాధి కోసం భార్య చాందినీ శివాలయం వద్ద ఓ మాల్ ‌లో పనిచేస్తోంది.


ఆమె విడిగా జీవనం సాగిస్తున్నదున్న భర్త నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ విషయమై ఇద్దరి మధ్య కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నాయి. కేసు వెనక్కి తీసుకోవాలని.. భార్యని ఇంటికి తీసుకెళ్తానని యాదవ్ సమాధానం ఇస్తూ వస్తున్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో భార్యపై తీవ్ర కోపం పెంచుకున్నాడు యాదయ్య.


అల్గు యాదవ్ తన భార్య పని చేస్తున్న మాల్ వద్దకు వెళ్లి పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణా రహితంగా నరికి చంపేశాడు. ఉన్మాది ఘాతుకాన్ని గమనించిన జనం అతన్ని అడ్డుకునేందుకు రాళ్లు విసిరారు. కానీ అతడు భార్యని వదలకుండా చనిపోయేంత వరకూ కిరాతకంగా చంపాడు. ఆమె తల, మొండెం వేరుచేశాడు. అనంతరం స్థానికులకు చిక్కకుండా పోలీస్ స్టేషన్‌ కి పారిపోయి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: