స్పాన్సర్ షిప్ కోసం అమెజాన్ తహతహ !
వచ్చే నెలలో యూఏఈ వేదికగా ఐపీఎల్ టోర్నీ జరగబోతుంది. ఇందుకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టైటిల్ స్పాన్సర్ నుంచి వివో తప్పుకోవడంతో...కొత్త కంపెనీ కోసం బీసీసీఐ వెతుకులాట ప్రారంభించింది. ఐపీఎల్ 2020కి స్పాన్సర్షిప్ అందించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, బైజూస్, డ్రీమ్ సహా మరికొన్ని కంపెనీలు లైన్లోకి వచ్చేశాయి. అమెజాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వివరించాయి.
స్పాన్సర్షిప్ దక్కించుకునేందుకు అమోజన్ వ్యూహాత్మాకంగా ముందుకు వెళుతోంది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో దసరా,దీపావళీ పండుగలు వస్తాయి. ఆ సమయంలో సహజంగానే షాపింగ్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల అమెజాన్ ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్ ఉంటే భారీగా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. అటు బైజూస్ కూడా స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడుతోంది. జియో కూడా స్పాన్షర్షిప్ వేటలో ముందున్నట్లు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ స్పాన్సర్ కోసం త్వరలోనే టెండర్లను పిలవనుంది బీసీసీఐ. వివో వల్ల కోల్పోయిన 440 కోట్లలో 3వ వంతు.. అంటే 180 కోట్లు వచ్చినా చాలని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆలోచిస్తోంది.
మొత్తానికి స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐ కంపెనీలను ఆహ్వానిస్తోంది. దీంతో పలు కంపెనీలు ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు పోటీలు పడుతున్నాయి. ఎలాగైనా స్పాన్సర్ షిప్ సొంతం చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా తమ పేరు మారుమోగేలా క్రేజ్ తెచ్చుకోవాలని పోరాడుతున్నాయి. అందులో భాగంగానే అమెజాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఆ అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు తెగ ఆరాటపడితోంది.
తద్వారా ఐపీఎల్ మ్యాచ్ లో కీలక భాగస్వామ్యం నెలకొల్పి పేరు తెచ్చుకోవాలని ఉవ్విళూరుతోంది అమెజాన్.