ఎల్ఐసి పాలిసీదారులకి బంపర్ ఆఫర్...ఇప్పుడు ఇలా చేస్తే లాభాలే లాభాలు...!
మీ ఎల్ఐసి పాలిసీ ల్యా్ప్స్ అయిపోయిందా? ఇంకా నిరాశ చెందకండి. మీ కోసం ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. ల్యాప్స్ అయిన పాలసీని మళ్లీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. దేశీ దిగ్గజ భీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ల్యాప్స్ అయిపోయిన పాలసీలను మళ్లీ రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎల్ఐసి. దీంతో ల్యాప్స్ అయిన పాలసీ కలిగిన వారు వెంటనే వారి పాలసీని రెగ్యులర్ చేసుకోండి. ఇలా చేసుకోవాలంటే ఈ పద్ధతిని అనుసరించండి. మీ ల్యాప్స్ అయిన పాలసీలను ఆగస్ట్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. కనుక ఐదేళ్లలోపు ల్యా్ప్స్ అయిన పాలసీలను ఇప్పుడు మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు.
పాలసీదారులు లేట్ ఫీజులో 30 శాతం వరకు తగ్గింపు కూడా ఇప్పుడు పొందొచ్చు. మీరు కనుక రూ.లక్ష వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం తగ్గింపు ఉంటుంది. కాబట్టి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. అదే కనుక మీరు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటే.. ఆలస్యం కి గాను 25 శాతం వరకు చెల్లించాల్సిన మొత్తం లో తగ్గింపు లభిస్తుంది. అదే రూ.3 లక్షలకు పైన ప్రీమియం కట్టాల్సి ఉంటే ఆలస్య రుసుముపై 30 శాతం వరకు తగ్గింపు మీరు ఇప్పుడు పొందవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించుకోవడం వల్ల పాలసీ ప్రయోజనాలు మళ్లీ తిరిగి లభిస్తాయి.