ఈయన మొగుడు కాదు.. దేవుడు.. భార్య కోసం ఏం చేశాడో చదివితే.. శెభాష్ అనాల్సిందే..!?
అయినా అసలు ఇంతకీ ఈ గుప్తాగారిని అంతగా పొగడాల్సింది ఏముంది అంటారా.. అసలు విషయం తెలిస్తే మీరు కూడా గుప్తా దేవుడే అంటారు. ఇక్కడ మీరు చూస్తుందంతా నిజం కాదు.. అదేంటి కళ్ల ముందే కనిపిస్తుంటే నిజం కాదంటారేంటి అంటారా.. అవును ఈ దృశ్యం వెనుక ఓ భర్త ప్రేమ ఉంది.. మాతృమూర్తి కోసం తపించిన బిడ్డల మమకారం.. ఈ దృశ్యంలో ఉన్న భార్య.. నిజం కాదు.. ఆమె ఓ మైనపు విగ్రహం.. నమ్మలేకపోతున్నారు కదా.. అవును నిజంగానే నమ్మడం కష్టం.
వాస్తవానికి ఆమె చనిపోయి చాలా కాలమైంది. చాలా ఏళ్ల క్రితమే ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. తాను కొత్త ఇళ్లు కట్టుకున్నవేళ..ఈ లోకంలో లేకపోయినా తన ఇల్లాలు ఆ వేడుకలో కనిపించాలని.. అతిధులను పలకరించాలని ఆ ఇంటి యజమాని గుప్తా భావించారు. ఆ కలను ఎలా సాకారం చేసుకోవాలా అని ఆలోచించారు. అప్పుడు ఎవరో చెప్పారు ఇలా విగ్రహాలు చేస్తారని.. అలా విగ్రహం తయారీ దారులను కలుసుకుని.. తన భార్యవిగ్రహం చేయించారు.
కొత్త గృహ ప్రవేశం వేడుకలో తన భార్య లేని లోటు తెలియకూడదన్న గుప్తా తాపత్రయం ఇంతటి అపురూప శిల్పానికి కారణమైంది. ఆ విగ్రహంతో కుటుంబ సభ్యులు ఫొటోలు దిగి మురిసిపోయారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కూడా ఈ విగ్రహం చూసి మురిసిపోయారు. సెల్ఫీలు దిగి దాచుకున్నారు. జీవ కళ ఉట్టిపడుతున్న ఆ విగ్రహం గురించి ఎవరైనా చెప్తే గానీ ఇది విగ్రహం అని తెలుసుకోవడం కష్టం .. భలే బావుంది కదా.