చీరలు విప్పి.. ప్రాణం కాపాడారు.. కానీ అంతలోనే..?

praveen
కళ్ళ ముందు ప్రాణాలు పోతుంటే.. కనీసం అంబులెన్స్ కు ఫోన్ చేయడం కాదు కదా సెల్ ఫోన్ లో వీడియోలు తీస్తుంటారు ఈ రోజుల్లో చాలా మంది. కానీ పాపం ప్రాణాలు పోతున్నాయి కదా కనీసం ఆసుపత్రికి తీసుకెళ్దాం  అనుకునేవారు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే మనిషిలో రోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. అయితే  మనుషుల్లో  ఇంకా మానవత్వం బతికే ఉంది అని కొన్ని ఘటనలు నిరూపిస్తూనే ఉంటాయి. తాజాగా జరిగిన ఘటన మనిషిలో మానవత్వం ఇంకా బతికే ఉంది.. ప్రాణాలు పోతుంటే మానం కూడా లెక్కచేయకుండా ప్రాణాలను కాపాడేంతగా మానవత్వం ఇంకా బతికే ఉంది అన్నది తాజా ఘటన నిరూపించింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకులను కాపాడడానికి మహిళలు ఏకంగా  చీరలు విప్పి జలాశయంలో యువకులను కాపాడేందుకు ప్రయత్నించారు.



 కానీ నలుగురు యువకుల్లో  ఇద్దరు యువకులను మాత్రమే  కాపాడగలిగారు. మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పెరంబలూర్ కొట్టరాయ్  సమీపంలోని సిరువచ్చుర్  గ్రామంలో క్రికెట్ ఆడేందుకు వచ్చారు యువకులు. ఈ క్రమంలోనే  సమీపంలో ఉన్న జలాశయం వద్దకు చేరుకున్నారు. ఇక జలాశయం దగ్గర బట్టలు ఉతికి ఇంటికి వెళుతున్న మహిళలను  జలాశయంలో స్నానం చేయవచ్చా అని అడిగారు. ప్రస్తుతం జలాశయంలోకి దిగడం ప్రమాదకరం అంటూ మహిళలు అప్పటికే హెచ్చరించారు. కానీ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కాలుజారి జలాశయంలో పడిపోయారు.. వారిని రక్షించేందుకు మరో ఇద్దరు యువకులు వెళ్లి వాళ్లు కూడా ప్రమాదంలో పడిపోయారు.



 ఇంటికి వెళుతున్న మహిళలు ఇది గమనించారు. కాసేపు కంగారు పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మరో ఆలోచన చేయకుండా తమ  ఒంటి మీద ఉన్న చీరలను విప్పేశారు. నీటిలో మునిగి ప్రాణాపాయ స్థితిలో  ఉన్న యువకులకు వారి చీరలను విసిరారు. ఇక మహిళలు విసిరిన చీరలను పట్టుకుని సదరు యువకులు అతికష్టం మీద బయటికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అప్పటికే వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కేవలం ఇద్దరు ప్రాణాలను మాత్రమే కాపాడగలిగారు మహిళలు. అయితే ఎంతో ధైర్యం చేసి ఏకంగా మానాలను కూడా లెక్కచేయకుండా చీరలు విసిరి యువకులను కాపాడడం తో ఎంతో మంది మహిళలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: