మైండ్‌ బ్లోయింగ్.. ఆ వ్యాక్సీన్‌తో అక్షరాలా 40 లక్షల కోట్లు లాభం..!?

Chakravarthi Kalyan

వ్యాక్సీన్.. వ్యాక్సీన్.. వ్యాక్సీన్.. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఔషధం ఇది. అసలు వ్యాక్సీన్ ఏం చేస్తుంది.. ఇది వేసుకుంటే వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఫలానా వ్యాధి వచ్చినా తట్టుకునే శక్తి మనిషికి ముందే ఇస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆ రోగం మనిషికి రాదు.. శతాబ్దాల నుంచి ఈ వ్యాక్సీన్లు మనిషిని అనేక ప్రాణాంతక రోగాల నుంచి కాపాడుతున్నాయి.


ఈ వ్యాక్సీన్ల వల్ల పలు రకాల అంటువ్యాధుల దగ్గరనుంచి క్యాన్సర్ల వరకూ ఈ వ్యాక్సిన్ల ద్వారా నివారించగలుగుతున్నాం. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్ని ఏటా 30 లక్షల వరకూ తగ్గించేశాం. నిరుపేద దేశాలన్నిట్లోనూ వ్యాక్సినేషన్‌ని సరిగ్గా అమలుచేస్తే ఇంకో పదిహేను లక్షల మరణాల్నీ తప్పించవచ్చట. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది.  


వ్యాక్సీన్ అంటే ఓ వ్యాధి రాకుండా మనలో నిరోధకత పెంచడమే.. ఆధునిక వైద్యంలో వ్యాధి నిరోధకత అత్యంత ముఖ్యమైనదే కాదు, విజయవంతమైన విభాగం కూడా. ఈ వ్యాక్సీన్ వల్ల ప్రభుత్వాలకు కూడా ప్రజారోగ్యం నిర్వహించడం సులభం అవుతుంది. ఎందుకంటే.. చాలా తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రభావం చూపిస్తుంది కాబట్టి. వ్యాక్సీన్ కోసం పెట్టే ఖర్చు ద్వారా.. అంతకు వందల రెట్ల నష్టాన్ని మనం నిరోధిస్తున్నామన్న మాట.


దీనికి సంబంధించిన ఓ స్టడీ చెబుతున్న విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. దాదాపు 94 దేశాల్లో పదిరకాల వ్యాక్సిన్లు వేయడానికి రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెడితే.. దాని ప్రభావం వల్ల  44 లక్షల కోట్ల వైద్య ఖర్చు ఆదా అయినట్లు తేలిందట. ఒక్క రూపాయి ఖర్చును ఆపగలిగామంటే.. ఒక రూపాయిని సంపాదించినట్టేనని ఆర్థిక వేత్తలు చెబుతారు. ఇటీవలి కాలంలో ఈ వ్యాక్సీన్ కు సంబంధించిన టెక్నాలజీ మరింతగా పెరిగింది. వ్యాక్సీన్‌ తయారీలో మాలెక్యులార్‌ జెనెటిక్స్‌, మైక్రో బయాలజీ, జీనోమిక్స్‌ లాంటి వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సీన్లు మనుషుల పాలిటి పెన్నిథులు అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: