చికెన్ ద్వారా కరోనా.. డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ..?
ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం హెడ్ మైక్ ర్యాన్ వెల్లడించారు. ఆహార ప్యాకేజీలపై కూడా కరోనా వైరస్ ఉంది అంటూ వస్తున్న వాదనలు దృశ్య తాము లక్షలాది ప్యాకేజీలను పరీక్షించి చూడగా కేవలం పదుల సంఖ్యలో ప్యాకేజీలలో మాత్రమే వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లుగా... వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.కాగా కొన్ని దేశాల నుంచి చైనా కు భారీ ఎత్తున మాంసం ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బ్రెజిల్ నుంచి చైనాకు దిగుమతి అవుతున్న చికెన్ వింగ్స్ లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు ఇటీవల చైనా ప్రకటించింది.
అయితే దీనిపై అటు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు బ్రెజిల్ ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రజల నుంచి దిగుమతి చేసుకుంటున్న చికెన్ వింగ్స్ లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించాము అంటూ చెబుతున్న చైనా.. దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ కోరింది బ్రెజిల్. తమ దేశం నుంచి ఎగుమతి అవుతున్న అన్ని వస్తువుల విషయంలో కఠినతరమైన నిబంధనలు పాటిస్తున్నాము అంటూ తెలిపిన బ్రెజిల్ వ్యవసాయ శాఖ... తమ దేశం దాటి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది మాత్రం తమ బాధ్యత కాదు అంటూ స్పష్టం చేసింది. మరి దీనిపై చైనా ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.