నేను అసలైన సైనికున్ని.. అసెంబ్లీలో సచిన్ పైలెట్..?

praveen
ఇటీవలే రాజస్థాన్ ప్రభుత్వం లో నెలకొన్న సంక్షోభానికి శుభం కార్డు పడిన విషయం తెలిసిందే, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడింది. అతని వెంట ఉన్న 18 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేయటం  రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసింది . సచిన్ పైలెట్ వర్గం తిరుగుబాటు తర్వాత రాజస్థాన్ రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఎట్టకేలకు అధిష్టానం కల్పించుకుని చర్చలు జరపడంతో సచిన్ పైలెట్ వర్గం మళ్ళీ సీఎం గెహ్లాట్ తో  కలిసి పని చేసేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరూ పైకి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ  ఫోటోలకు  పోజులు ఇస్తున్నప్పటికీ... లోలోపల మాత్రం అంతర్గత విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి అన్నది ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట.



 గురువారం సీఎల్పీ భేటీ సందర్భంగా సచిన్ పైలెట్ అశోక్ గెహ్లాట్ మధ్య ముఖాముఖి జరిగింది . ఈ క్రమంలోనే ఇద్దరు షేక్ హ్యాండ్  ఇచ్చుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూనే ... ఒకరిపై ఒకరు  ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ఒకరికి ఒకరు చురకలు అంటించుకున్నట్లు సమాచారం. సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినప్పటికీ విశ్వాసపరీక్షలో గెలిచే సత్తా  తనకు ఉంది అని... సీఎం గెహ్లాట్ నిర్మొహమాటంగా సభలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా శుక్రవారం అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా సీఎం ఆయన వర్గంతో ప్రత్యేకంగా అసెంబ్లీకి హాజరు కావడం గమనార్హం.



 అంతేకాకుండా సచిన్ పైలెట్ వర్గానికి అధికార పార్టీకి కాస్త దూరంగా ప్రతిపక్ష పార్టీకి దగ్గరగా సీట్లు కేటాయించడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇక ఇదే విషయంపై అసెంబ్లీ వేదికగా స్పందించిన సచిన్ పైలెట్ ప్రభుత్వంపై పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో తమ సీటింగ్ విషయానికి వస్తే తాము ఎందుకు చివర్లో కూర్చోవాల్సి వస్తుంది అంటే... ఇది సరిహద్దు కేవలం ధైర్యవంతులు అతి  శక్తివంతులైన సైనికులు మాత్రమే సరిహద్దుల్లోకి పంపుతారు... అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సచిన్ పైలెట్. అసెంబ్లీ వేదికగా సచిన్ పైలెట్ వ్యాఖ్యలకు... ఆయన వర్గం  మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: