జగన్ సర్కార్ విశాఖ రాజధాని నిర్ణయానికి వరుస బ్రేకులు....?

Reddy P Rajasekhar
ఏపీలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజల మెప్పు పొందుతూ మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్టాభివృద్ధి మూడు రాజధానుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రభుత్వం భావించింది. ఈ దిశగా చర్యలు చేపట్టి మొదట్లో ఆటంకాలు ఎదురైనా గవర్నర్ ఆమోద ముద్రను సైతం పొందింది. అయితే జగన్ విశాఖకు రాజధానిని తరలించాలని చేస్తున్న ప్రయత్నానికి మరో బ్రేక్ పడింది.
 
కానీ హైకోర్టు స్టేటస్ కో గురించి జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా సుప్రీం విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. కోర్టులో పిటిషన్లు దాఖలు కాకపోతే ఈ నెల 16న సీఎం కార్యాలయానికి శంఖుస్థాపన, ఇతర కార్యక్రమాలు విశాఖలో జరిగేవి. వీలైతే పంద్రాగస్టు వేడుకలను కూడా విశాఖలోనే నిర్వహించాలని జగన్ సర్కార్ భావించింది. కేంద్రం ఇప్పటికే రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినదని తమ ప్రమేయం ఉండదని తేల్చి చెప్పింది.
 
హైకోర్టు నేడు పిటిషన్లపై విచారణ జరిపి 27 వరకు స్టేటస్ కో విధిస్తూ 27కు విచారణను వాయిదా వేసింది. తెలుగుదేశం జగన్ సర్కార్ విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తే కోర్టు కేసుల వల్ల పోరాడినా లాభం ఉండదని భావిస్తోంది. అదే సమయంలో జగన్ సర్కార్ మాత్రం విశాఖ నుంచి పాలన మొదలుపెడితే కోర్టు సమస్యలు తొలగుతాయని భావిస్తున్నా కోర్టు స్టేటస్ కో జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెడుతోంది.
 
మరోసారి హైకోర్టు స్టేటస్ కో విధించడంతో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. వరుసగా జగన్ సర్కార్ కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతుండటం గమనార్హం. కోర్టుల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నిస్తున్నా కోర్టుల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు ప్రభుత్వ నిర్ణయాలు ఆలస్యంగా అమలవ్వడానికి కారణమవుతున్నాయి. జగన్ సర్కార్ హైకోర్టు స్టేటస్ కో విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: