దారుణం : ప్రియుడి మోజులో పడిన తల్లి.. ఎంత పని చేసింది..?
కట్టుకున్న భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తూ... పేగు తెంచుకుని పుట్టిన కన్న బిడ్డలను చిత్రహింసలకు గురి చేస్తోంది. ఈ దారుణ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... తంబీగాని పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు.కొన్నాళ్ల క్రితమే భర్తను వదిలేసిన సదరు మహిళ ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో... ఆ వ్యక్తితో అక్రమ సంబంధానికి తెరలేపి బెంగళూరులో అతనితో సహజీవనం చేస్తోంది,
ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన సదరు మహిళ తంబిగానిపల్లెకు వచ్చేసింది. ఇక గత కొద్దిరోజుల నుంచి పిల్లలను చిత్రహింసలకు గురి చేయడం.... తీవ్రంగా కొట్టడం లాంటివి చేస్తోంది. అయితే కొన్ని రోజుల వరకు ఇలాగే పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చింది సదరు మహిళ. అయితే ఇంట్లో నుంచి రోజు పిల్లల కేకలు వినిపిస్తుండటంతో స్థానికులు ఆరా తీసారు. దీంతో ఆ తల్లి పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఆదివారం రాత్రి మరోసారి పిల్లలను దారుణంగా వేధిస్తుండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలకు రక్షణ కల్పించటంతో పాటు... చిత్ర హింసలకు గురిచేసిన తల్లి పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు.