షాకింగ్ ఫాక్ట్‌ : కరోనా మనలో 20% మందికి వచ్చిపోయిందట..!?

Chakravarthi Kalyan
కరోనా ఇంకా మీకు రాలేదని సంతోషపడుతున్నారా.. అయితే మీకు షాకింగ్ విషయం ఒకటి తెలుసా.. బహుశా మీకు కరోనా వచ్చే ఉండొచ్చు.. మీకు తెలియకుండానే వెళ్లిపోయి కూడా ఉండొచ్చు. ఔను.. నిజం.. నమ్మబుద్దికావడం లేదా.. కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ విషయం ఏపీ సర్కారు నిర్వహిస్తున్న పరిశోధనలో ఈ విషయం తేలిందట.



ఏపీ సర్కారు సిరో సర్వైలెన్స్  అనే సర్వే నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరిశీలించడం ద్వారా ఈ  సర్వే నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో సిరో సర్వైలెన్స్‌ను ఇటీవల నిర్వహించింది.


ఈ రక్త నమూనాల్లోని యాంటీ బాడీల ఆధారంగా ఫలితాలు ఇస్తున్నారు.  న్యూదిల్లీ, మహారాష్ట్రలోనూ ఇలాంటి సర్వే నిర్వహించారు. ఈ ఫలితాల ద్వారా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యుల నియామకం వంటి చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  ఈ సర్వే ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20% మందికి కరోనా సోకింది, వెళ్లింది. కానీ..ఈ విషయం వారికి తెలియదు.


ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు, నగరాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 70% చొప్పున వీటిని తీసుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళలు, ఇతర ప్రమాణాల మేరకు ఈ సేకరణ జరిగింది. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, నెల్లూరు జిల్లాలో 9%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14% మంది చొప్పున వైరస్‌ సోకింది. కానీ వీరెవరికీ వైరస్‌ సోకినట్లు తగ్గిపోయినట్లు తెలియదు. కారణం వారికి ఎటువంటి అనుమానిత లక్షణాలు లేకపోవడమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: