పెళ్ళైన మరుసటి రోజే.. ఆ నిజం బయటపడింది.. చివరికి..?
వివరాల్లోకి వెళితే... కడప జిల్లా పుల్లంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి తన అక్క కూతురు తో ఆగస్టు 15న వివాహం జరిగింది. కానీ ఆదివారం సాయంత్రం నుంచి నవవధువు కనిపించకుండా పోయింది. సమీప బంధువుల ఇంట్లో గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది, దీంతో చేసేదేం లేక పెళ్ళికొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు, ఈ క్రమంలోనే అందరూ షాక్ అయ్యే ఘటన జరిగింది, నవ వధువు ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తాను యువకుడి ప్రేమించానని తల్లిదండ్రులు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయడంతో ఇంటి నుంచి పారిపోయినట్లు పోలీసులకు తెలిపింది యువతి..
వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులు బంధువులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అందరి సాక్షిగా మేనమామ కట్టిన తాళి తీసేసిన సదరు యువతి ప్రియుడితో తాళి కట్టించుకొన్న విషయాన్ని కుటుంబ సభ్యులు చూసి షాక్ అయ్యారు. తాను ప్రియుడితో కలిసి జీవిస్తానని యువతి అందరి ముందు తెగేసి చెప్పేసింది యువతి . ఈ విషయం కాస్త ఊరంతా పాకి పోవడంతో... పెద్దల సాక్షిగా సదరు యువతిని పెళ్లి చేసుకున్న యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బంధువుల ముందు తలెత్తుకోలేను అని తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అతను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.