పకృతి పగబట్టిన వేళ.. పడవే పాడెగా మారింది.. చివరికి..?

praveen
ప్రస్తుతం ప్రజలందరూ కరోనా  వైరస్ తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు శరవేగంగా వృద్ధి చెందుతున్న కరోనా వైరస్ కారణంగా బిక్కుబిక్కుమంటూ దినదినగండంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ఏ రోజు కరోనా  వైరస్ దాడి చేసి ప్రాణాలమీదికి తీస్తుందో అని భయపడుతూనే బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రకృతి కూడా ఎంతో మంది ప్రజలపై పగబట్టి ప్రాణాలు తీస్తున్నది . మరింత దీని పరిస్థితి ని తీసుకొచ్చి ఈ బ్రతుకు అవసరమా అనేంతలా  పరిస్థితి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించి పోతున్న విషయం తెలిసిందే.



 భారీగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయాయి . పూర్తిగా జలమయం అవడం తో జనజీవనం స్తంభించిపోయింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. ఇప్పటికే కరోనా  వైరస్ తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఇప్పుడు వరదల కారణంగా అసలు బతుకుతామొ  లేదో అని అనుమానం తోనే క్షణక్షణం చిగురుటాకులా వణికిపోతున్నారు  ప్రజలు. గోదావరి వరదలు పరివాహక ప్రాంతాల ను ముంచెత్తుతున్న వేళ  కనీసం అంతిమ సంస్కారాలకు ఆరడుగుల స్థలం కూడా కరువైన పరిస్థితి ప్రస్తుతం ఆయా గ్రామాల్లో కనిపిస్తోంది.




 తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... చర్ల మండలం గొంపల్లి లో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తోట మల్లయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కానీ అప్పటికే పూర్తిగా జలమయమైన గ్రామంలో అతని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఆరు అడుగుల స్థలం కూడా లేని దుస్థితి ఏర్పడుతుంది. ఇక అతని అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న గ్రామస్తులు అందరూ చివరికి ఓ ఆలోచన చేశారు. పడవనే  పాడే గా మార్చి మృతదేహాన్ని అందులో ఈత వాగు వంతెన వరకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి పంచాయితీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్ లో  6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకుంఠధామం కి తీసుకెళ్లి అంతిమ  సంస్కారాలు నిర్వహించాల్సిన  దుస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: