మోడీ ని ఎదుర్కోవాలంటే.. రాహుల్ వద్దు.. జగన్ కాంగ్రెస్ లోకి రావాలి..?

praveen
ఎంతో చరిష్మా కలిగిన.. పార్టీగా కేంద్రం రాష్ట్రం అన్న తేడా లేకుండా దేశం  మొత్తం  పాలనను కొనసాగిస్తూ.. దశాబ్దాలపాటు భారతదేశాన్ని పాలిస్తూ వచ్చింది జాతీయ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు అయోమయంలో పడిపోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2014 ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్న విషయం తెలిసిందే. క్రమక్రమంగా బిజెపి పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాలను సొంతం చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఒక బలమైన జాతీయ పార్టీగా ఎదిగింది.  ఇలాంటి  పరిణామాల నేపథ్యంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా బిజెపి ని సరిగ్గా ఎదుర్కోలేక పోతుంది.




 అదే సమయంలో గత కొన్ని రోజుల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓటమి పాలవ్వడంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా  కొనసాగుతున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి సరైన అధ్యక్షుడు వస్తే గాని ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగుపడే అవకాశం లేదు అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్న మాట.



 అయితే కాంగ్రెస్ కి అత్యంత ప్రీతిపాత్రుడు కమ్యూనిస్టు ఐడియాలాజిస్ట్ అయినా  రామచంద్ర గుహ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోడీ ఎంతో శక్తివంతంగా మారారని.. మోడీ ని  ఎదుర్కోవాలంటే పార్టీ బలపడాలంటే.. జగన్,  మమతా బెనర్జీ, శరత్ పవర్ లు  మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో  కలవాలని.. రాహుల్ గాంధీ స్థానంలో కష్టపడి పనిచేసి హిందీ వాక్చాతుర్యంతో ప్రజలందరినీ ఆకర్షించగలిగే  జనాకర్షణ కలిగిన నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వాలని.. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన బలమైన నేతలు కలవకపోతే బీజేపీ ని అడ్డుకోవడం కష్టం అన్నది ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: