అది ఎవడబ్బ సొమ్మ అంటూ ఉత్తమ్ కి సూచనలు.. వారిపై విమర్శలు చేసిన వీహెచ్ ?
కానీ లబ్ధిదారులకు తెలియకుండానే వాళ్లకు కేటాయించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని వీహెచ్ చెప్పుకొచ్చారు. 2006లో దీనిపై హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. భూసంస్కరణలు అమలు చేసి పేదలకు పంచాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక చోట్ల పేదల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, ప్రభుత్వ భూములు సైతం ఎంతో మంది ఆక్రమించారని, వీటన్నిటిని పాటించుకుని న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రభుత్వం పట్టించుకోకపోయినా, పేదలకు కేటాయించాల్సిన భూములపై కాంగ్రెస్ రాజీ లేని పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని వీహెచ్ చెప్పుకొచ్చారు. అసలు లబ్ధిదారులను పక్కనపెట్టి, ఎవరెవరికో సంబంధం లేని వ్యక్తులకు ఎమ్మార్వో నాగరాజు పట్టాలు జారీ చేశారని వీహెచ్ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ విషయంపై దృష్టి పెట్టి, ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సూచించారు. అసలు ఎమ్మార్వో నాగరాజు కలెక్టర్ కు ఉన్న సంబంధం ఏమిటో ముందు బయటపెట్టాలి అని, అసలు ఈ 94 ఎకరాలు ఎవడబ్బ సొమ్ము అంటూ వీహెచ్ ఘాటుగా విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.