బాబు పరువు నిలబెడుతున్న ఎమ్మెల్యేలు వీరే...

M N Amaleswara rao
2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ వేవ్‌లో ప్రత్యర్ధి పార్టీ టీడీపీ చిత్తుగా చిత్తుగా ఓడిపోయింది. అయితే జగన్ గాలిని సైతం ఎదురొడ్డి టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అంటే వారు సొంత ఇమేజ్‌తోనే టీడీపీ తరుపున గెలవగలిగారనే చెప్పొచ్చు. కాకపోతే అధికారం వైసీపీ వైపు ఉండటంతో, గెలిచాక చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు తేలిపోతున్నారు.

ఇప్పటికే టీడీపీ తరుపున గెలిచిన కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు జగన్‌కు మద్ధతు తెలిపారు. దీంతో టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఇక ఇందులో గంటా శ్రీనివాసరావు కూడా రేపో మాపో జంప్ అయిపోతారని వార్తలు వస్తున్నాయి. వీరిని పక్కనబెడితే టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇందులో చంద్రబాబుని తీసేస్తే, మిగిలిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది మంచి పనితీరు కనబరుస్తున్నారంటే...కొందరే బాబు పరువు నిలబెట్టేలా పని చేస్తున్నారని చెప్పొచ్చు. మొదట టీడీపీలో బాగా పనిచేస్తున్న వారిలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందుంటారని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈయన నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారు. అటు తూర్పుగోదావరి జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరీ, ఆదిరెడ్డి భవాని, వేగుళ్ళ జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్పలు బాగానే బాబు పరువు నిలబెడుతున్నారు. అయితే గంటాని పక్కనబెడితే విశాఖలోని ముగ్గురు ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌లు పర్వాలేదనిపిస్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు జైలులో ఉండగా, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్, ఉరవకొండ-పయ్యావుల కేశవ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్, కొండపి- బాలవీరాంజనేయస్వామి, ఉండి-మంతెన రామరాజులు కాస్త డౌన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: