కాశ్మీర్ పై చైనా ప్రకటన.. భారత్ దిమ్మతిరిగే కౌంటర్.. పాక్ కూడా..?
అయితే ఈ ఎకనామిక్ కారిడార్ పిఓకే నుంచి వెళ్లడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం భారత్ మాత్రమే కాదు బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ లోని ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు పీవోకే నుండి వెళ్లడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవలే పాకిస్తాన్ చైనా మంత్రుల మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది, ఈ సమావేశం అనంతరం ఇరు దేశాలు ఓ ప్రకటన విడుదల చేయగా... ఇక వీరి ప్రకటనలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు ఇరు దేశాలు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన భారత్.. కాశ్మీర్ భారత భాగమని కాశ్మీర్ అంశంలో ఇతరుల జోక్యం అసలు సహించేది లేదు అంటూ పునరుద్ఘాటించింది.
కాగా ప్రస్తుతం భారత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారగా.. పాక్ చైనా లు ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా గత కొన్ని రోజుల నుంచి సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్న చైనా భారత్ ను క్రమక్రమంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తమ బానిస దేశమైన పాకిస్తాన్ తో కలిసి భారత్ ను రెచ్చగొట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది చైనా. ప్రస్తుతం చైనా పాకిస్థాన్ కీలక ప్రాజెక్టు విషయంలో కూడా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తటం కూడా... ఇలాంటి కోవకు చెందినది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.