కరోనాను జయించాడు.. ఆరుసార్లు ప్లాస్మా దానం.. చివరికి..?

praveen
ప్రస్తుతం శరవేగంగా కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో విజృంబిస్తు  ప్రజలందరినీ ఆస్పత్రి పాలు చేయటమే కాదు ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కు సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేని నేపథ్యంలో ప్రస్తుతం వైద్యులు కరోనా వైరస్ కు చికిత్స లో  ప్రత్యామ్నాయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వైరస్ చికిత్సలో ప్లాస్మా తెరఫీ ఎంతగానో మంచి ఫలితాలను ఇస్తుంది అని వైద్యులు సూచిస్తున్నారు.



 ఇక రోజురోజుకు కరోనా  చికిత్సలో భాగంగా ప్లాస్మా తెరఫీ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ బారినపడి చికిత్స తీసుకుని కోరుకున్నవారు ప్లాస్మా దానం  చేసి ఇతరుల  ప్రాణాలను కాపాడండి అంటూ ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.  అంతే కాదు ఎంతో మంది సెలబ్రిటీలు సైతం కరోనా  వైరస్ బారి నుంచి కోలుకున్న వారు  ప్లాస్మా దానానికి  ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ప్లాస్మా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 216 మంది రక్తదానం చేసి పెద్ద మనసు చాటుకున్న ఆయన... కరోనా  వైరస్ బారి నుంచి కోలుకుని ఏకంగా ఆ ఆరుసార్లు ప్లాస్మా దానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.



 ఇటీవలే హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా సంపత్ కుమార్ ను సన్మానించారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కి చెందిన సంపత్ కుమార్ బ్యాంకు ఉద్యోగి. గాంధీ ఆసుపత్రిలో ఓ రోజు రక్తం అందక  చనిపోవటం చూసి..   ఆ తర్వాత నుంచి రక్తదానం చేయడం మొదలుపెట్టారు. 216సార్లు రక్తదానం చేశారు సంపత్ కుమార్. దీనికిగాను ఏకంగా  వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో  చోటు సంపాదించుకుని డాక్టరేట్ సంపాదించారు. ప్లాస్మా దానం విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ఆరుసార్లు ప్లాస్మా దానం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు సంపత్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: