ఆంటీ తో అడవిలో పాడుపని .. ఆ తర్వాతే సీన్ రివర్స్..?

praveen
ఇటీవల పోలీసులకు సవాలుగా మారిన మెదక్ జిల్లాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలతో  అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. సీసీ టీవీ పుటేజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు కటకటాల వెనక్కి తోశారు. వివరాల్లోకి వెళితే... హవేలీ ఘనపూర్  మండలం తోగుట కు చెందిన  మహేష్ ఈనెల 16వ తేదీన ఫ్రెండ్ పెళ్లి నిమిత్తం పాపన్నపేట కు వచ్చాడు. నాగ్సాన్ పల్లి  కి చెందిన సాలమ్మ అనే మహిళ ఇదే  పెళ్లికి హాజరయ్యారు. అయితే పెళ్లికి హాజరైన సాలమ్మ పై  మహేష్ కన్నేశాడు.




 ఎలాగైనా కామవాంఛ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుల సహాయంతో సాలమ్మ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు మహేష్. ఇక ఆ తర్వాత  రోజు సదరు మహిళకు ఫోన్ చేసిన మహేష్... మాటలు కలిపి సాలమ్మ ఎక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకుని  వెంటనే బైక్ పై అక్కడకు వెళ్ళాడు. తర్వాత సాలమ్మ ను  ఎక్కించుకుని నాగ్సాన్ పల్లి  అటవీ ప్రాంతం తీసుకెళ్లి...  మహిళతో శారీరకంగా గడిపాడు. అయితే శారీరకంగా గడిపిన అనంతరం సాలమ్మ  మహేష్ ను డబ్బులు డిమాండ్ చేయడంతో తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు మహేష్.



 ఈ క్రమంలోనే మహిళ తలపై బండరాయితో బలంగా కొట్టాడు. మళ్లీ  బయటకెళ్ళి తర్వాత  ఈ విషయాన్ని ఎవరికైనా చెబితుందేమో  అనే అనుమానంతో మరింత బలంగా తలపై బండరాయితో మోదడంతో  అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది సాలమ్మ . ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని పొదల్లో పడేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. సాలమ్మ  కనిపించకపోవడంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు  పోలీసులు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారగా..  ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. సాలమ్మ  కాల్ లిస్ట్ సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: