స్నేహితుడే శత్రువు అయ్యాడు.. చివరికి దారుణంగా.?

praveen
ఎంతో విలువైన మనుషుల ప్రాణాలకు రోజురోజుకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఎంతోమంది హత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఏకంగా కావాల్సిన వారి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటన జరిగింది. స్నేహితుడే  శత్రువు గా మారిపోయాడు. చివరికి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికంగా అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.



 అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ లో జరిగింది ఈ దారుణ ఘటన. వివరాల్లోకి వెళితే... ఎఫ్ బ్లాక్ లో నివాసముంటున్న వేముల రామకృష్ణ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు, భార్యతో మనస్పర్థలు రావడంతో విడిపోయిన రామకృష్ణ ప్రస్తుతం తన ఆరేళ్ల కుతూరు,  తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే సాయంత్రం సమయంలో రామకృష్ణకు స్నేహితుడి నుండి ఫోన్ రావడంతో బయటికి వెళ్లాడు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రామకృష్ణ అతని స్నేహితుడైన తన్నీరు ఆంజనేయులు, పండు, సునీల్  కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు.



 కానీ ఇంతలో రామ కృష్ణ ఆంజనేయులు మధ్య గొడవ మొదలైంది. పక్కనే  ఉన్న మిగతా స్నేహితులు వీరిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దీంతో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో ఆంజనేయులు రామకృష్ణ పై దాడి చేశాడు. చాతిలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం అయిన రామకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక ఆ తర్వాత స్నేహితులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ హత్య పోలీసులకు సవాల్ గా మారిపోయింది. ఇక మృతుడి సోదరుడు తెలిసిన వ్యక్తులే తన అన్నను  చంపి ఉంటారని అనుమానం తో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి  ఎంతో చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: