మహిళా ఎస్సై తో ప్రేమ.. తర్వాత పెళ్లి.. చివరిలో అసలు ట్విస్ట్..?

praveen
ఈ మధ్యకాలంలో మాయ మాటలతో నమ్మించి ఎంతోమంది మహిళలను నట్టేట  ముంచేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో లొంగదీసుకొని ఆ తర్వాత... పెళ్లి చేసుకోవాలి అంటూ ఒత్తిడి తీసుకురావటం తో ... మొహం చాటేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్  వృత్తిలో  కొనసాగుతున్న ఓ పోలీస్ బాధ్యతగా వ్యవహరించాల్సింది  పోయి మోసగాడి గా మారిపోయాడు. తనతో పాటే పనిచేసే మహిళా ఎస్సై నీ శారీరకంగా లొంగదీసుకుని కామవాంఛలు తీర్చుకున్నాడు, ఇక ఆ తర్వాత సదరు మహిళను పెళ్లి చేసుకొని చివరికి నట్టేట ముంచి  పరారయ్యాడు.




 ఇక ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిగింది అన్న సంతోషం సదరు మహిళ పోలీస్ అధికారి కి ఎక్కువ రోజులు ఉండలేదు ... భర్త నట్టేట్లో ముంచేసి పరారు కావడంతో భర్త కోసం బాధితురాలు తల్లడిల్లుతోంది. మోసపోయానని గ్రహించి డీజీపీని ఆశ్రయించింది బాధితురాలు. ఈ దారుణ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లా కలికోట పోలీస్ స్టేషన్ లో ... ఎస్సైగా పనిచేస్తున్న సిల్లు దాల అనే వ్యక్తి తనను మోసం చేశాడు అంటూ ఓ మహిళా ఎస్సై డిజిపిని ఆశ్రయించాడు, 2017లో భువనేశ్వర్ లో  పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో.. సెల్లుదాలా తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతలోనే మాయమాటలు చెప్పి మహిళను  లొంగదీసుకున్నాడు సెల్లుదాలా .



 కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ కోరడంతో నిరాకరించాడు, దీంతో వెంటనే బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు కలుగజేసుకోవటం తో  ఆమెను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకొని ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక పది నెలల పాటు మహిళ తో కాపురం చేసిన భర్త తర్వాత కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ  డీజీపీ ని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: