కుక్క చిలిపి పని.. 5 లక్షలు ఖర్చు.. ఏం చేసిందో తెలుసా..?

praveen
మామూలుగా ఈ మధ్యకాలంలో కుక్కల ని పెంచుకోవడం ఒక ట్రెండ్ గా   మారిపోయిన విషయం తెలిసిందే.  కేవలం  కుక్కల ని పెంచుకోవడం ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే కాదండోయ్... ట్రెండ్ ను ఫాలో అయ్యే వాళ్లు కూడా కుక్కలను పెంచుకుంటున్నారు. అంతే కాదు మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే  కుక్కల మీదనే ఎక్కువ ప్రేమ  చూపిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది. ఇక్కడ ఇలాగే ఎంతో ముద్దుగా కుక్కని పెంచుకున్నారు. ఆ కుక్క చేసిన చిలిపి పనికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.



 అమెరికాలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన. వివరాల్లోకి వెళితే.. ఏమిట్ కౌంటీలోని కోర్ట్ హౌస్ భవనానికి సమీపంలో జస్టిస్ బిల్డింగ్ అనుసంధానిస్తూ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ని ఏర్పాటు చేసారు . ఈ కేబుల్  ఎవరికీ అందకుండా చాలా ఎత్తులోనే ఉంటుంది. కానీ కోర్టు బిల్డింగ్ వద్ద మాత్రం భూమి లోకి వెళ్తుంది ఈ వైర్ . సరిగ్గా  భూమి లోకి వెళ్లే ప్రాంతంలో ఆ కుక్క ఈ వైర్ ను  ముక్కలు చేసి చిలిపి పని చేసింది. దీంతో సిగ్నల్ కాస్త కట్ అయిపోయింది. తర్వాత ఈ సిగ్నల్ పునరుద్ధరించు కోవడానికి ఎంత  ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.



 దీంతో సూపర్వైజర్లు రంగంలోకి దిగి 3600 డాలర్లు వెచ్చించి కొత్త కేబుల్ సిగ్నల్ ను మళ్లీ పునరుద్ధరించారు. ఇది  ఎలా జరిగింది అనే విషయాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా తెలుసుకున్న అధికారులు.. ఆ కుక్క యజమాని నుంచి కేబుల్ వైర్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం రాబట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కుక్క మాత్రం కేబుల్ ను కోరిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యింది . ఇప్పటివరకు జాడ  లేదు. ఇక ఆ కుక్క  ఎక్కడ కనిపిస్తుందా  అని అధికారులు ఎంతో ఆతృతగా వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: