కొడాలి కరెక్ట్‌గానే అడుగుతున్నారు..బాబే ఆన్సర్ ఇవ్వాలి...
ముఖ్యంగా చంద్రబాబుకైతే చుక్కలు చూపిస్తారు. మంత్రి అయిన దగ్గర నుంచి బాబుపై వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారు. అలాగే బాబు ఏమన్నా జగన్ మీద గానీ విమర్శలు చేస్తే, వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. అయితే ఆ కౌంటర్లు కూడా మామూలుగా ఉండవు. ఓ రేంజ్‌లో బాబుపై విరుచుకుపడతారు. ఈ మధ్య కూడా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైతే...చంద్రబాబు అండ్ బ్యాచ్ కోర్టు మెట్లు ఎక్కి, ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
రాజధానికి ఇచ్చిన భూములని పేదల ఇళ్ల పట్టాలకు ఎలా ఇస్తామని అడ్డుపడ్డారు. ఇక ఈ విషయంపై గత రెండురోజుల నుంచి కొడాలి నాని సీరియస్‌గా ఓ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనప్పుడు అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టడం కూడా అనవసరమని కొడాలి అంటున్నారు. ఇక్కడ శాసన సభ వద్దని సీఎం జగన్‌ని కోరతానని చెబుతున్నారు.
ప్రైవేట్ సంస్థలకు వేల ఎకరాలు కట్టబెట్టోచ్చు గానీ, పేదలకు ఓ వెయ్యి ఎకరాలు ఇవ్వడానికి ఇబ్బంది వచ్చిందని బాబుని ప్రశ్నిస్తున్నారు. అసలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని అమరావతిలో అసెంబ్లీ కూడా వద్దని డిమాండ్ చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదన్న చోట శాసనసభలు ఉండకూడదన్న తన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అంటుంటే ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్‌లు నోరెందుకు మెదపడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొడాలి చెప్పేది కరెక్ట్ అని వైసీపీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. పేదలకు రాజధానిలో ఇళ్ళు ఇస్తుంటే బాబుకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నారు. ఏదేమైనా కొడాలి అడిగిన ప్రశ్నకు బాబుకు సమాధానం చెప్పే దమ్ముందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.