ఏపీ, తెలంగాణాల్లో కరోనా పరీక్షలు.. అనుమానితుల తిప్పలు ఇవే..?
తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పరీక్షల కు సంబంధించి సరికొత్త వాదనను తెరమీదకు వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా అనుమానితుల కు పరీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాసుపత్రు ల్లో మాత్రం కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ప్రభుత్వాలు కరోనా పరీక్షల విషయం లో కఠిన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి ల్లో మాత్రం ఇలాంటిదే జరుగుతుందట.
కేవలం తీవ్రస్థాయిలో లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారట. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లిన వారిని తిప్పి పంపిస్తున్నారట ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఏంటి అని ప్రశ్నిస్తే పీపీఈ కిట్లు లేవని... లేదా టెస్టింగ్ కిట్లు లేవు అంటూ సమాధానం చెబుతున్నారట. దీంతో ఎంతో మంది కరోనా వైరస్ పరీక్ష చేసుకోవడానికి వెళ్లినప్పటికీ.. పరీక్షలు చేసుకోకుండానే వెను తిరుగుతున్నారట. ఇలాంటి పరిణామాలతోనే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు.ఇలా ఎక్కువగా లక్షణాలు కనిపించని వారికి కరోనా పరీక్షలు చేయకపోవడంతో... వారు అందరిలాగే ప్రజల్లో తిరిగి కరోనా వాహకులు గా మారి మరింత మందికి ఈ వైరస్ వ్యాపించేలా చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.