మోదీ అంటే చైనీయులకు మోజు గురూ ? చైనా పత్రిక చెప్పిందేంటంటే ?
భారత్ ను దెబ్బతీసేందుకు సైనిక బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తూ హడావుడి చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉంటే భారత్ అంటే చైనా ప్రజలకు కూడా చాలా అభిమానం అని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరుతో ఆయనకు అభిమానులు చైనాలో పెరిగిపోయారు అంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే ఈ మాట ఆషామాషీగా అయితే చెప్పలేదట. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ముఖ్యంగా చైనా లో ఉండే నాయకుల కంటే, ఎక్కువ మంది ప్రజలు ప్రధాన మోదీ అంటే ఇష్టపడుతున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు, విధానాలు చైనా ప్రజలను ఆకర్షిస్తున్నట్టు గ్లోబల్ టైమ్స్ సర్వేలో తేలింది.
అలాగే చైనా అంటే భారత్ లోని నూటికి 70 మంది వ్యతిరేకిస్తున్నారని, అలాగే రెండు దేశాల మధ్య మళ్ళీ స్నేహపూరిత వాతావరణం ఏర్పడే రోజు అతి తొందరలో ఉందని, 30 శాతం మంది ప్రజలు నమ్ముతున్నట్టుగా గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. అయితే ఉన్నట్టుండి చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ సర్వే చేయడం, దానిని ప్రచురించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిత్యం భారత్ పై ఒంటికాలితో లేస్తూ, హడావుడి చేసే చైనా భారత్ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోంది ? వ్యూహాత్మకంగానే తమ అధికారిక పత్రిక లో మోదీకి అనుకూలంగా ఉండే విధంగా సర్వే రిజల్ట్ ప్రకటించారా అనే అనుమానాలు జనాల్లోనూ పెరుగుతున్నాయి.