మూడు ప్రాంతాలకు సమన్యాయం... రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ది సాధ్యం:’సీఎం జగన్

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో గత  కొంత కాలంగా రాజధానుల రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన తర్వాత విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార పక్షం కూడా ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు అంటూ స్పష్టం చేస్తంది. త్వరలో విశాఖ కేంద్రంగా కార్య నిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రంగా న్యాయ రాజధానికి పునాదులు వేస్తామని సీఎం జగన్  పేర్కొన్నారు.  రాష్ట్ర  విభజన గాయాలు మానాలన్న, అలాంటి గాయాలు మరల తగలకూడదన్న రాష్ట్ర ంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. అందుకే వికేంద్రీకరణే సరైనదని నిర్ణయించామని స్పష్టం చేశారు.


మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగిలా మూడు రాజధానుల బిల్లులను చట్టంగా మార్చిన విషయాన్ని ఆయన తెలిపారు. రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం, ప్రజాస్వామ్యం ప్రకారంవ్యవస్థలు నడుచుకోవాలన్నారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్న సీఎం ఎస్సీ,బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. పేద పిల్లలు ఆంగ్ల మాధ్యంలో చదవకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.


రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈ క్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూ గత 14 నెలల పాలన సాగిందన్నారు. వాహనమిత్ర, రైతు భరోసా, పింఛన్ కానుక, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, కాపునేస్తం, గోరుముద్ద, 30లక్షల ఇళ్ల పట్టాలు, కంటి వెలుగు, చేయూత, పాఠశాలలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు ఇలా ఏపథకం తీసుకున్నా పేదరికం నుంచి బయటపడేందుకు చిత్తశుద్దితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవే అని సీఎం స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: