అద్దెకు ఉండే వారికి కరోనా.. మనస్తాపంతో యజమాని ఆత్మహత్య..?

praveen
రోజురోజుకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతూ ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా  వైరస్ ప్రజలందరిలో  ప్రాణ భయం పాతుకు  పోయేలా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ పై రోజురోజుకు ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ కొంతమందిలో మాత్రం ఇప్పటికీ అవగాహన లేమితో భయంతో వణికి పోతున్నారు. కరోనా  సోకిందేమో అన్న భయం తో ఏకంగా మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు  కూడా ఎక్కువవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది



 ఇంట్లో అద్దెకి ఉన్నవాళ్లకి కరోనా  వైరస్ సోకడంతో  ఇంటి యజమానురాలు కి కరోనా  భయం పట్టుకుంది. ఇక తనకు కూడా కరోనా  వైరస్ సోకడం  కాయం అని నిర్ణయించుకుని తీవ్ర మనస్తాపానికి గురైంది సదరు మహిళ. ఈ క్రమంలోనే కఠిన తీసుకుని ఏకంగా ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషాదకర ఘటన మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మలక్ పేటలోని శాలివాహన నగర్ లో విజయ అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే ఇటీవలే ఆ సదరు మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు కరోనా  వైరస్ బారిన పడ్డారు.



 దీంతో వారిని వైద్యులు కరోనా  ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంటి యజమానురాలికి కరోనా  భయం పట్టుకుంది. 50 సంవత్సరాల వయసున్న విజయ... తనకు కూడా కరోమా  వైరస్ సోకుతుందేమో అని తీవ్ర మనస్తాపానికి గురైంది. కరోనా  వైరస్ సోకిన తర్వాత ప్రాణాలు పోతాయేమో అని కుంగిపోయి కఠిన నిర్ణయం తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే  గుర్తించిన స్థానికులు సదరు మహిళను ఆసుపత్రికి తరలించినప్పటికే ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయ ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: