భారత్ అనుకుంది.. అమెరికా చేసింది.. పాక్ కి భారీ షాక్..?

praveen
పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. ఉగ్రవాదులు  అందరికీ తల్లి తండ్రి అన్ని  కూడా పాకిస్తాన్ అయిపోతుంది. అయితే మత రాజ్య  స్థాపనే లక్ష్యంగా ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఇతర దేశాలలో విధ్వంసం సృష్టించేందుకు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అయితే తమ దేశ ప్రజల మౌలిక వసతుల విషయంలో.. అభివృద్ధి విషయంలో లేని  శ్రద్ధ.. ఇతర దేశాలలో విధ్వంసం సృష్టించడంలో చూపిస్తూ ఉంటుంది పాకిస్తాన్. అయితే భారత్ ఎన్నో రోజుల నుంచి పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఉగ్ర రాజ్యాంగ నిరూపించి దోషిగా నిలబెట్టేందుకు  ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

 ఇటీవల జరిగిన ఘటనతో ఇది త్వరలో జరగబోతున్న ట్లు తెలుస్తోంది. పాకిస్థాన్  మాదిరిగానే సిరియా కూడా ఐఎస్ఐఎస్  ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. కాగా  ఇటీవలే సిరియాలో ఏకంగా 20 మంది ఉగ్రవాదులను అమెరికా సైన్యం పట్టుకుంది. అయితే సైన్యం ఇటీవలే అరెస్టు పట్టుకున్న  ఉగ్రవాదులు అందరూ పాకిస్థాన్ లో పుట్టి ఉగ్రవాదులు గా మారిన వాళ్లే అన్న విషయం బయటపడింది. దీంతో కేవలం పాకిస్తాన్ లో మాత్రమే కాదు... సిరియాలో  కూడా ఉగ్రవాదాన్ని నడుపుతుంది పాకిస్తాన్ దేశమే అన్న టాక్ వినిపిస్తుంది.


 అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం సీరియస్ గా  స్పందించింది. 20మంది ఉగ్రవాదులను విచారించేందుకు ఆదేశాలు జారీ చేసింది అమెరికా ప్రభుత్వం. అమెరికా నిర్ణయంతో పాకిస్తాన్ కు  భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. అయితే ఒకవేళ ప్రస్తుతం అమెరికా ఈ ఘటనపై విచారణ జరిపితే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు  అన్నింటికి కేరాఫ్ అడ్రస్ అన్నది  బయట పడే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాద దేశంగా దోషిగా మారే రోజులు ఇంకొన్ని రోజుల్లో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: