అప్పుడు అదృశ్యం అయ్యారు.. ఇప్పుడు అస్తి పంజరాలుగా మారారు.. బయటపడ్డ నిజాలు..?

praveen
మనుషుల్లో  రోజు రోజుకు మానవత్వం కరువవుతుంది.. దీంతో సాటి మనుషుల ప్రాణాలు తీయడం లో అసలు వెనకడుగు వేయడం లేదు మనిషి. సొంత వారి ప్రాణాలను సైతం ఎంతో సులభంగా మానవత్వం లేకుండా గాలిలో కల్పిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య భర్తలు ఇద్దరు పిల్లలతో కుటుంబం మొత్తం ఎంతో హాయిగా సాగిపోతుంది. కానీ అంతలో అనుకోని సంఘటన. ఇంట్లో ఉండే నలుగురు కుటుంబసభ్యులు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.



 దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ ఇటీవలే అసలు నిజం బయట పడడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు నిజం బయటికి రావడంతో ఏడాది క్రితం అదృశ్యమైన నలుగురు కుటుంబసభ్యులు  అస్తిపంజరాలుగా  కనిపించారు. దారుణ ఘటన ఉత్తరాఖండ్ లో  వెలుగులోకి వచ్చింది. ఉద్దమ్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన హీరాలాల్  అతడి భార్య ఇద్దరు కుమార్తెలు గతేడాది ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయారు. అయితే ఇటీవలే హీరాలాల్  అల్లుడు నరేంద్ర ఇటీవలే  చనిపోయినవారి మరణ ధ్రువీకరణ పత్రాల కోసం... హీరాలాల్ స్నేహితున్ని  సంప్రదించారు.




 దీంతో నరేంద్ర గంగ్వార్ పై అనుమానం కలిగింది హీరాలాల్ స్నేహితుడికి. దీంతో వెంటనే అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నరేంద్ర ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో సంచలన నిజాలు బయట పడ్డాయి. భూమి కోసం తన మామను వారి కుటుంబ సభ్యులను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు హీరాలాల్ అల్లుడు నరేంద్ర. తన మిత్రుడితో కలిసి ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాలను ఆ ఇంటి ప్రాంగణంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టినట్లు తెలిపాడు. దీంతో షాకైన పోలీసులు నిందితులను అరెస్టు చేసే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: