ఓర్నీ.. బాబుని వారు వదిలేసినా, వీళ్ళు వదల్లేదు గా ? అదే అభిమానమంటే ?

అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది ? అధికారానికి దూరం అయితే ఎలా ఉంటుందో టీడీపీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడు బాగా తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో పదవులు అనుభవించిన నాయకులు, ఇప్పుడు కష్టకాలంలో మొహం చాటేస్తూ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటూ అధిష్టానం నుంచి పిలుపు వస్తున్నా, పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తూ ఉండటం వంటి పరిణామాలతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ భవిష్యత్తు కల్పించడంతో పాటు, ఆర్థికంగా అన్ని రకాలుగా అవకాశం కల్పించినా, ఇప్పుడు ఈ కష్టకాలంలో మొహం చాటేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్ అవ్వడం, యాక్టీవ్ గా ఉంటే కేసులతో పాటు, ఆర్ధికంగానూ పార్టీ కార్యక్రమాల ఖర్చులు భరించాల్సి వస్తుందేమో అన్న అభిప్రాయంతో నియోకవర్గ స్థాయి నాయకులు నోరు మెదపడం లేదట.  

నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చాలామంది పార్టీ  పిలుపు ఇస్తున్న కార్యక్రమాలను చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీ పిలుపు ఇస్తున్న అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ, పార్టీకి అన్ని రకాలుగా అండదండలుగా నిలుస్తున్నారనే విషయం తాజాగా చంద్రబాబు గ్రహించారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు ఇచ్చిన ఫోటోలు, వీడియోలు చంద్రబాబు పరిశీలించగా, అందులో నాయకులు హాజరు కాకపోయినా, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు హాజరు కావడం బాబుకు ఎక్కడలేని సంతోషాన్ని కలిగిస్తోంది.

పార్టీ అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీని పట్టించుకోకపోయినా, పార్టీపై ఉన్న అభిమానంతో మండల స్థాయి నాయకులు టిడిపిని వదిలి పెట్టలేదు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. ప్రభుత్వ కేసులకు కూడా భయపడకుండా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పార్టీపై అభిమానం చూపిస్తున్నారని, దీంతో మండల స్థాయిలో కీలకంగా వ్యవహరించిన నాయకులు అందరి వివరాలు సేకరించి ప్రత్యేకంగా వారికి బాబు లేఖలు రాయాలని డిసైడ్ అయ్యారట.వీలైతే ఫోన్ లు కూడా చేసి వారిని ఉత్సాహపరచాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అప్పుడు మరింత ఉత్సాహంగా వారు పని చేస్తారని బాబు అభిప్రాయపడుతున్నారట.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: