ఎన్నికల వేళ ట్రంప్ కు ఇంటిపోరు.. !

NAGARJUNA NAKKA
అమెరికాకు అధ్యక్షుడు అంటే ఒక సూపర్ పవర్. ఆయన తీసుకునే ఒక్కో నిర్ణయం.. ప్రపంచ గతిని మార్చేస్తుంది. ఒక్క మీట నొక్కితే అణు బాంబులు.. విస్పోటనం సృష్టిస్తాయి. అంత పవర్ ఫుల్ వ్యక్తి అయిన ట్రంప్ కూ.. ఇంటిపోరు తప్పడం లేదు. ఫస్ట్ లేడీ మెలానియాకు.. కూతురు ఇవాంకాకు అస్సలు పడటం లేదు.
ఈ సమస్య ఇప్పటిది కాదు. చాలారోజుల నుంచి మెలానియాకు, ఇవాంకాకు పడటంలేదు. పేరుకు మెలానియా ఫస్ట్ లేడీ అయినప్పటికీ.. మొత్తం పెత్తనమంతా ఇవాంకాదే అని మొదటి నుంచి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్‌లదే.. ట్రంప్ నిర్ణయాల్లో కీలకపాత్ర. వాళ్లు చెప్పినట్లే ట్రంప్ వింటారని.. మొదటి నుంచి టాక్. అందుకే మెలానియాకు మొదటి నుంచి వాళ్లను చూస్తే ఒళ్లు మంట.
ఇవాంకా కారణంగా మెలానియా పాత్ర పరిమితం కావడంతో.. ఆమె మొదటి నుంచి ట్రంప్ పై గుర్రుగానే ఉంటున్నారు. ఈ సంగతి చాలా సందర్భాల్లో బయటపడింది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు.. మెలానియా చేయి పట్టుకోవడానికి ట్రంప్ ఎంత ప్రయత్నించినా.. ఆమె వదిలించుకోవడానికే చూసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఇలా చాలా సందర్భాల్లో.. ట్రంప్ - మెలానియా మధ్య సఖ్యత లేదని బయటి ప్రపంచానికి తెలిసింది.
ఎన్నికలవేళ ఇంటిపోరు ట్రంప్ కు తలనొప్పిలా మారిపోయింది. ఒకవైపు మెలానియా, ఇవాంకా గొడవ కొనసాగుతుండగానే.. ట్రంప్ సోదరి పేరు మీద బయటపడ్డ రికార్డింగ్స్.. అమెరికా అధ్యక్షుడికి కొత్త సమస్యలు తీసుకొచ్చాయి. డొనాల్డ్‌ ట్రంప్ క్రూరమైన, నమ్మలేని వ్యక్తి అంటూ ట్రంప్ సొంత‌ సోదరి మేరీ బ్యారీ చేసిన వ్యాఖ్యలు  చర్చనీయాంశమయ్యాయి. టూ మచ్‌ అండ్‌ నెవర్‌ ఎనఫ్‌ అనే పేరుతో ట్రంప్‌ మేనకోడలు మేరీ లియా రాసిన పుస్తకం ఈ మధ్యే ప్రచురితమైంది. అందులోనే ట్రంప్‌ సోదరి బ్యారీతో సంభాషించిన ఆడియో టేపుల ట్రాన్స్‌స్క్రిప్ట్‌ తాజాగా బయటకు వచ్చింది. ట్రంప్‌ విలువలులేని, అబద్దాలు ఆడే వ్యక్తి' అంటూ అతని సోదరి మేరీఅన్నే బ్యారీ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్‌ ట్రంప్ పనికిరాని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: