ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సరళి

ఆంధ్రప్రదేశ్‑లో పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‑లాల్ వెల్లడించారు. పోలింగ్ గడువు సాయంత్రం 6.00 గంటల్లోగా క్యూ లైన్‑లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.బుధవారం హైదరాబాద్‑లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజా సమాచారం ప్రకారం సీమాంధ్ర వ్యాప్తంగా 77 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆన మీడియాతో మాట్లాడుతూ అత్యధికంగా గుంటూరు జిల్లాలో 83 శాతం పోలింగ్ నమోదు అయిందని అన్నారు. ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉన్నందున సుమారు 80 శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీమాంధ్ర్రలో రెండు, మూడు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని,విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం, పలకజీడిలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. పలకజీడి పోలింగ్ బూత్ నుంచి రెండు ఈవీఎంలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది మావోయిస్టులు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పలకజీడి అటవీ ప్రాంతం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, ఇక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 152 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే విజయవాడ మెగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీలో ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీలలో రూ. 3 కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే సీమాంధ్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) స్పందించింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో కలిపి 73.46 % పోలింగ్ జరిగిందని తెలిపింది. అక్రమ నగదు, మద్యం తరలింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అగ్రస్థానం అని వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 502 లోక్‑సభ స్థానాలకు పోలింగ్ పూర్తి అయిందని వివరించింది. దేశవ్యాప్తంగా 66.27 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సీఈసీ వివరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాధమిక వివరాల ప్రకారం జిల్లాల వారీగా పోలింగ్ శాతం శ్రీకాకుళం జిల్లాలో 76 శాతం అదే 2009 ఎన్నికల్లో 75శాతం, విజయనగరం జిల్లాలో 78 శాతం అదే 2009 ఎన్నికల్లో 76 శాతం,విశాఖపట్నం జిల్లాలో 76 శాతం 2009 ఎన్నికల్లో 73 శాతం,తూగో జిల్లాలో 79 శాతం 2009 ఎన్నికల్లో 78 శాతం,పగో జిల్లాలో 78 శాతం 2009 ఎన్నికల్లో 84 శాతం,కృష్ణా జిల్లాలో 80 శాతం 2009 ఎన్నికల్లో 81 శాతం,గుంటూరు జిల్లాలో 83 శాతం 2009 ఎన్నికల్లో 79 శాతం,ప్రకాశం జిల్లాలో 80 శాతం 2009 ఎన్నికల్లో 77 శాతం,నెల్లూరు జిల్లాలో 73 శాతం 2009 ఎన్నికల్లో 71 శాతం,కడప జిల్లాలో 75 శాతం 2009 ఎన్నికల్లో 75 శాతం,కర్నూలు జిల్లాలో 76 శాతం 2009 ఎన్నికల్లో 70 శాతం,అనంతపురం జిల్లాలో 80 శాతం 2009 ఎన్నికల్లో 73 శాతం,చిత్తూరు జిల్లాలో 78 శాతం 2009 ఎన్నికల్లో 77 శాతం ఓట్లు పోలయాయి. జిల్లాల వారీగా పోలింగ్ శాతం పట్టిక : జిల్లా 2009 2014 75 శాతం శాతం విజయనగరం 76 శాతం 78 శాతం విశాఖపట్నం 73శాతం 76 శాతం తూర్పు గోదావరి 78 శాతం 79 శాతం పచ్చిమ గోదావరి 84 శాతం 78 శాతం కృష్ణా 81 శాతం 80 శాతం గుంటూరు 79 శాతం 83 శాతం ప్రకాశం 77 శాతం 80 శాతం నెల్లూరు 71 శాతం 73 శాతం కడప 75 శాతం 75 శాతం కర్నూలు 70 శాతం 76 శాతం అనంతపురం 73 శాతం 80 శాతం చిత్తూరు 77 శాతం 78 శాతం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: