కష్టాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి? స్పీడ్ పెంచిన కేసీఆర్?

VAMSI
నల్గొండ జిల్లా రాజకీయాలంటే టక్కున మనకు గుర్తొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత ఎన్నికలలో నల్గొండ జిల్లా నుంచి అన్న వెంకట్ రెడ్డి ఓటమి పాలవ్వగా, నల్గొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అయితే ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారట. ఆ నియోజకవర్గంలో తన సన్నిహితులు మరియు విధేయులు ఒక్కరొక్కరుగా కోల్పోతున్నారు.   వీరంతా మూకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీలోకి వెళుతుండటంతో రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.





తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టిపట్టు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లా మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన టిఆర్ఎస్ పార్టీ నల్గొండ లో మాత్రం కోమటిరెడ్డి కుటుంబం ముందు నిలవలేకపోయింది. నల్గొండ జిల్లా కి మొత్తం గానూ ఒక్క జగదీష్ రెడ్డి మాత్రమే టిఆర్ఎస్  తరపున గెలిచి మంత్రి కూడా అయ్యాడు. అయితే రెండోసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది టిఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కలవగా కాంగ్రెస్ మాత్రం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ సత్తా చాటింది. నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ అందరినీ మట్టి కరిపించి టిఆర్ఎస్ తన హవా కొనసాగించింది.





జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు అందరూ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు టిఆర్ఎస్ మళ్లీ వేట మొదలు పెట్టడంతో కాంగ్రెస్ కు మంచి పట్టున్న నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది ఒక్క మునుగోడులోనే మిగతా అన్ని సీట్లు టిఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే తను బీజేపీలోకి చేరబోతున్నట్లు హల్చల్ చేశాడు. మళ్లీ ఏమైందో ఏమో ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి కోమటిరెడ్డి పై ఉన్న నిలకడలేని మరియు అతనిపై నమ్మకం లేక తాజాగా ఇప్పుడు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో చేరారు. దీంతో కోమటిరెడ్డి తన మద్దతుదారులను పెద్ద ఎత్తున కోల్పోయాడు




ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే తప్ప కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.  ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కి  నియోజకవర్గంలోనూ  కోమటిరెడ్డి పై అపనమ్మకంతో నేతలంతా టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి చెబుతూనే ఉన్నా ఇప్పుడు ఆ పార్టీకి నల్గొండ జిల్లాలో కూడా సొంత పార్టీ నాయకులు వాపోతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి నల్గొండ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. మరి భవిష్యత్తులో అక్కడ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందా?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: